|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయకు రాశి సీరియస్ వార్నింగ్! ఆ కామెంట్లపై లీగల్ యాక్షన్ ఆలోచన..

Published: 05-01-2026, 3:00 AM
అనసూయకు రాశి సీరియస్ వార్నింగ్! ఆ కామెంట్లపై లీగల్ యాక్షన్ ఆలోచన..
  • హీరోయిన్స్ వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో పెద్ద వివాదం చెలరేగింది.
  • ఈ వివాదంలో నటి అనసూయ శివాజీకి కౌంటర్ ఇవ్వగా, తాజాగా రాశి ఆమెపై స్పందించారు.
  • అనసూయ ‘రాశి గా*రి ఫలాలు’ అనే మాట వాడటంపై నటి రాశి సీరియస్ అయ్యారు.
  • తనపై చేసిన కామెంట్స్‌కు లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకున్న రాశి, తల్లి ఆపడంతో వెనక్కి తగ్గారు.

హీరోయిన్స్ వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఈ వివాదంలో అనసూయ చేసిన కామెంట్లపై సీనియర్ హీరోయిన్ రాశి తీవ్రంగా స్పందించారు. అనసూయపై లీగల్ చర్యలకు వెళ్లాలని అనుకున్నానని రాశి వెల్లడించారు. ఈ సంచలన వార్తపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

శివాజీ వస్త్రధారణ వివాదం: అసలేం జరిగింది?

Raasi: హీరోయిన్స్ వస్త్రధారణపై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఎంత వివాదం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వివాదంలో ఆయన మహిళా కమీషన్ వరకు వెళ్లి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే, ఈ వివాదంలో అనూహ్యంగా అనుసయా హైలెట్ అయ్యింది. ఆడవాళ్ళ బట్టల గురించి చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌటర్ ఇచ్చింది.

మా బాడీ.. మా ఇష్టం.. ఎలాంటి బట్టలైనా వేసుకుంటాం అంటూ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగకుండా శివాజీపై వరుస వీడియోలు, పోస్ట్ పెట్టింది. ఈ వివాదంలో నటుడు శివాజీకి సామాన్య జనం నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. చెప్పిన తీరు తప్పై ఉండొచ్చు కానీ, చెప్పింది మాత్రం అస్సలు తప్పు లేదు అని కామెంట్స్ చేశారు. అదే సమయంలో అనసూయకు కూడా అదిరిపోయే కౌంటర్లు ఇచ్చాడు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ రాశి(Raasi) కూడా చేరింది.

అనసూయపై రాశి సంచలన కామెంట్స్

అనసూయ టార్గెట్ గా అదిరిపోయే కౌంటర్లు ఇచ్చింది. పేరు చెప్పకుండానే పరువు తీసేసింది. ‘నటుడుశివాజీ చెప్పింది 100% తప్పు కాదు. కానీ, వాడిన పదాలు కొన్ని తప్పు. వాటికి ఆయన స్వారీ కూడా చెప్పారు కదా. కానీ కొంతమంది మాత్రం బాగా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఆవిడే ఓ షోకి యాంకర్ గా ఉంటూ.. రాశి గా*రి ఫలాలు అనే మాట వాడారు.

లీగల్ యాక్షన్ ఆలోచన వెనుక కారణం

దానికి షో జడ్జిలు కూడా పగలబడి నవ్వారు. ఒక మహిళగా అలాంటి మాట ఎలా అంటారు. ఈ వివాదంపై లీగల్ గా వెళ్దామని అనుకున్నాను.. కానీ మా అమ్మ ఆపడంతో ఆగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది రాశి. దీంతో నటి రాశి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అనసూయ వ్యాఖ్యలపై రాశి ఆగ్రహం వ్యక్తం చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు లీగల్ చర్యలకు దిగాలని రాశి భావించారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.