|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్‌

Published: 12-09-2025, 6:17 AM
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్‌

ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ తన సొంత ఇంటిని ఉచిత విద్య పాఠశాలగా మార్చడం ద్వారా మరోసారి తన సేవా మనోభావాలను ప్రదర్శించారు. ఇంటిని అనాథ పిల్లలకు ఇచ్చేసి ప్రస్తుతం కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

Key Points

1

రాఘవ లారెన్స్ తన సొంత ఇంటిని ఉచిత పాఠశాలగా మార్చారు.

2

ఆయన ఈ ఇంటిని డ్యాన్స్ మాస్టర్‌గా సంపాదించిన డబ్బుతో కొన్నారు.

4

ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు ఆయన ఇంట్లో పెరిగిన బిడ్డే.

రాఘవ లారెన్స్‌ సేవా కార్యక్రమాలు

రాఘవ లారెన్స్‌ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు  సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్‌ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్‌ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం,  విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది.  అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.

సొంత ఇంటిని ఉచిత పాఠశాలగా మార్పు

తాజాగా రాఘవ లారెన్స్‌ సోషల్‌మీడియాలో ఒక వీడియో షేర్‌ చేశారు. ‘మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే.  ఈ క్రమంలోనే  నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.

అద్దె ఇంటికి మారిన రాఘవ లారెన్స్

ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్‌గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో  నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు.  ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో  మొదటి ఉపాధ్యాయులు కూడా  నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు  చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది.  మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.’ అని ఆయన అన్నారు.

రాఘవ లారెన్స్‌ తన సేవా మనోభావాలను మరోసారి చాటుకున్నారు. తన సొంత ఇంటిని విద్యార్థులకు అంకితం చేయడం ఆయనకు ఎంతో గర్వకారణం అని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.