|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mohan Babu: ఆకలితో వచ్చిన కోపం అది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Published: 31-05-2025, 11:46 AM
Mohan Babu: ఆకలితో వచ్చిన కోపం అది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్ వైరల్

‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మోహన్ బాబు, తన జీవితంలోని కష్టాలు, విజయాలు మరియు ఆకలితో వచ్చిన కోపం గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ, విద్యాలయాల స్థాపన గురించి వివరించారు.

Key Points

1

మోహన్ బాబు గారు 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్ లో తమ జీవిత అనుభవాలను పంచుకున్నారు.

2

ఆకలితో వచ్చిన కోపం గురించి ఆయన తన చిన్ననాటి కష్టాలను వివరించారు.

4

విద్యాలయాలు, మోహన్ బాబు యూనివర్సిటీలను స్థాపించి విద్యకు సేవ చేస్తున్నారు.

‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్

మంచు విష్ణు డీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో యాక్ట్ చేస్తూ నిర్మాతగా వ్యవహిరిస్తున్న మంచు మోహన్ బాబు (Mohan Babu).. తాజాగా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో పాల్గొని జీవితంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘నేను కూడా ఒకప్పుడు.. హే ఇప్పుడు నా సినిమా సూపర్ హిట్.. నెక్ట్స్ సినిమా కూడా సూపర్ హిట్ అనేవాడిని. కానీ ప్లాప్ అయ్యేవి. ఎందుకంటే విజయం మన చేతిలో ఉండదు. మనం సిన్సియర్‌గా కష్టపడ్డామా.. డీసెంట్‌గా, డిసిప్లేన్‌గా ఉన్నామా అనేదే ముఖ్యం. అలా 1975 నవంబర్ 22 నా మొదటి చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత 500కు పైగా సినిమాల్లో నటించాను. 70 సినిమాలకు నిర్మాతా ఉన్నాను. అయితే.. నేను చాలా ముక్కుసూటి మనిషిని.

అలాగే నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. అది మీ అందరికి తెలుసు. అదే నా వీక్‌నెస్. అందరికి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. అందరూ కోపం తెచ్చుకుంటారు. నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే.. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఫుడ్ కూడా లేదు. అలా మద్రాస్‌లో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు, మోహన్ బాబు యూనివర్సిటీలు, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాం. అలాగే క్యాస్ట్ అనేదాన్ని కూడా ఏ రోజు లెక్కచెయ్యలేదు. అలా ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు.

జీవితంపై మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

కష్టాలు, విజయాలు మరియు విద్య

మోహన్ బాబు గారి జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. కష్టాలను అధిగమించి, విజయం సాధించి, సమాజానికి సేవ చేస్తున్న ఆయన కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.