|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రాఘవేంద్రరావుకు మాట ఇచ్చి.. తీర్చకుండానే వెళ్ళిపోయిన హీరోయిన్!

Published: 11-03-2026, 5:35 AM
షాకింగ్: రాఘవేంద్రరావుకు మాట ఇచ్చి.. తీర్చకుండానే వెళ్ళిపోయిన హీరోయిన్!
  • రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు 24!
  • శ్రీదేవితో 25వ సినిమా చేయాలనే రాఘవేంద్రరావు కోరిక నెరవేరకుండానే పోయింది!
  • దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి మృతి.. ఇది ఇప్పటికీ మిస్టరీనే!
  • `మామ్` సినిమా సమయంలో రాఘవేంద్రరావుకి మాట ఇచ్చిన శ్రీదేవి!

టాలీవుడ్‌లో విషాదం! రాఘవేంద్రరావు గారితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఆయనకు మాట ఇచ్చి కూడా నెరవేర్చకుండానే కన్నుమూశారు. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబినేషన్ హిట్స్

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన కెరీర్‌లో వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో దాసరి నారాయణరావు తర్వాత ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడిగా రాఘవేంద్రరావు నిలిచారు. ఇప్పుడు ఆయన దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. చివరగా చేసిన కొన్ని సినిమాలు ఆడకపోవడంతో ఆయన దూరమయ్యారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

అయితే రాఘవేంద్రరావుకి తీరని కోరిక ఒకటి ఉంది. ఓ హీరోయిన్‌తో మరోసారి పనిచేయాలనేది, ఆమెతో మైల్‌ స్టోన్‌ మూవీ చేయాలనేది రాఘవేంద్రరావు కోరికగా చెప్పొచ్చు. అయితే ఆ కోరిక తీరలేదు. ఎప్పటికీ తీరలేదు. ఆయన కోరికని నెరవేరుస్తానని మాటిచ్చిన హీరోయిన్‌ ఇప్పుడు లేదు. దీంతో రాఘవేంద్రరావు మైల్‌ స్టోన్‌ మూవీ లేకుండా పోయింది. ఆమెతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్‌ అయ్యింది.

25వ సినిమా చేయాలనే కోరిక తీరకుండానే..

రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోలకు, హీరోయిన్లకు లైఫ్‌ ఇచ్చాడు. ఎంతో మంది హీరోయిన్లని వెండితెరకు పరిచయం చేశాడు. స్టార్లని చేశాడు. చాలా మంది హీరోలకు కమర్షియల్‌ సక్సెస్‌ ని అందించి తిరుగులేని స్టార్స్ ని చేశాడు. అలా తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన వారిలో శ్రీదేవి ఒకరు. అతిలోకసుందరి శ్రీదేవి బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. కానీ రాఘవేంద్రరావు చిత్రాలతోనే హీరోయిన్‌గా మారింది. తిరుగులేని స్టార్‌డమ్‌ని అందుకుంది.

రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `వజ్రాయుధం`, `ఆఖరిపోరాటం`, `సుహాగన్‌`, `దేవత`, `పదహారేళ్ల వయసు`, `వేటగాడు`, `మాస్టర్జీ`, `జస్టీస్‌ చౌదరీ`, `త్రిశూలం`, `హిమ్మత్‌వాలా`, `తోఫా`, `ఫార్జ్ ఔర్‌ కనూన్‌` ఇలా చాలా సినిమాలు చేశారు. అయితే శ్రీదేవితో తన దర్శకత్వంలో 25వ సినిమా చేయాలనేది రాఘవేంద్రరావు కోరిక. దాన్ని అప్పట్లో `మామ్‌` సినిమా సమయంలో వెల్లడించారు. అప్పుడు శ్రీదేవి కూడా ఓకే చెప్పింది. మీతో వర్క్ చేయడం గౌరవమని, కచ్చితంగా చేద్దామని చెప్పింది.

శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ!

రాఘవేంద్రరావుకి మాటిచ్చిన కొన్ని రోజులకు శ్రీదేవి కన్నుమూశారు.   దుబాయ్‌కి ఓ ఫంక్షన్‌ కోసం వెళ్లిన శ్రీదేవి అందులోనే బాత్‌ టబ్‌లో పడి కన్నుమూసింది. దీంతో ఆమె మరణం మిస్టరీగానే మారింది. భర్త బోణీ కపూర్‌ చేయించాడని అన్నారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం దీన్ని యాక్సిడెంట్‌గానే ధృవీకరించారు. దీంతో శ్రీదేవితో తన 25వ మూవీ చేయాలనే రాఘవేంద్రరావు కోరిక తీరలేదని చెప్పొచ్చు.

శ్రీదేవి మరణం టాలీవుడ్‌కు తీరని లోటు. రాఘవేంద్రరావు గారి కల నెరవేరకుండానే ఆగిపోయింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.