|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rahu Transit in Kumbha Rasi: త్వరలో కుంభరాశిలో రాహువు సంచారం.. ఈ 4 రాశుల వారి పంట పండినట్టే.. సంపద, ఉద్యోగాలు ఇలా ఎన్నో!

Published: 17-04-2025, 7:43 AM
Rahu Transit in Kumbha Rasi: త్వరలో కుంభరాశిలో రాహువు సంచారం.. ఈ 4 రాశుల వారి పంట పండినట్టే.. సంపద, ఉద్యోగాలు ఇలా ఎన్నో!

మే 18న రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం మేష, మిధున, కర్కాటక, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరికి ఉద్యోగాలు, సంపద, కుటుంబ సంతోషం లభిస్తాయి.

Key Points

1

మేష, మిధున, కర్కాటక, ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాలు.

2

ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, ఆర్థిక ప్రగతి.

4

ఊహించని లాభాలు, సంపద వృద్ధి.

మేష, మిధున, కర్కాటక, ధనస్సు రాశులకు ప్రయోజనాలు

మే 18న రాహువు కుంభరాశిలో సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. రాహువు సంచారంతో ఈ రాశుల వారికి తిరుగుండదు అని చెప్పొచ్చు. రాహువు త్వరలో రాశి మార్పు చేస్తాడు. రాహువు కుంభ రాశిలో మే 18వ తేదీన సంచరిస్తాడు.

ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నాలుగు రాశుల వారు అదృష్టంతో పాటు ఎన్నో లాభాలు పొందుతారు. మరి ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మేష రాశి వారికి రాహు కుంభరాశి సంచారం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. కెరియర్లో మంచి అవకాశాలని అందిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి మార్పు వలన మేష రాశి వారి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. సంపద కూడా పెరుగుతుంది.

ఉద్యోగ, ఆర్థిక అంశాలపై రాహువు ప్రభావం

రాహువు సంచారం మిధున రాశి వారికి కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగుంటుంది. ఆఫీసులో సీనియర్ల సహాయం అందుతుంది. మీ పని మీకు గుర్తింపుని తీసుకువస్తుంది.

రాహువు సంచారం కర్కాటక రాశి వారికి కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. రాహువు సంచారంతో కర్కాటక రాశి వారు కెరియర్ లో దూసుకు వెళ్లిపోతారు. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. అనుకున్న వాటిని సాధిస్తారు. గొడవలు, చికాకులు తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

కుటుంబ జీవితంపై రాహువు ప్రభావం

ధనస్సు రాశి వారికి రాహువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. రాహువు రాశి మార్పుతో ధనస్సు రాశి వారికి ఊహించని లాభాలు ఉంటాయి. కెరియర్లో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. తోటి ఉద్యోగస్తుల సహాయంతో కొత్త పనిని మొదలు పెడతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.