|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rahul Dev: ‘అందువల్లే నా తమ్ముడు చనిపోయాడు’.. రాహుల్‌ దేవ్ క్లారిటీ!

Published: 16-06-2025, 11:49 AM
Rahul Dev: 'అందువల్లే నా తమ్ముడు చనిపోయాడు'.. రాహుల్‌ దేవ్ క్లారిటీ!

బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ తన తమ్ముడు ముకుల్ దేవ్ మరణంపై తాజాగా స్పందించారు. ముకుల్ మరణానికి ఆహారపు అలవాట్లు కారణమని, డిప్రెషన్ కాదని తెలిపారు. ఈ విషాద ఘటనపై వివరణ ఇచ్చారు.

Key Points

1

రాహుల్ దేవ్ తమ్ముడు ముకుల్ దేవ్ మరణానికి ఆహారపు అలవాట్లే కారణమని వెల్లడించారు.

2

ముకుల్ డిప్రెషన్‌లో లేడని, జీవితంపై ఆసక్తి కోల్పోయాడని రాహుల్ తెలిపారు.

4

సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లను రాహుల్ దేవ్ ఖండించారు.

ముకుల్ దేవ్ మరణంపై రాహుల్ దేవ్ స్పష్టత

రామ్ చరణ్ మూవీ ఎవడు చిత్రంలో అభిమానులను మెప్పించిన బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్. విలన్‌గా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఫ్యాన్స్‌ను మెప్పించారు. సౌత్‌లో చివరిసారిగా అజిత్ కుమార్‌ నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీలోనూ కనిపించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేవ్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు, నటుడైన ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ముకుల్ మరణంపై పలు రూమర్స్ వినిపించాయి. డిప్రెషన్ వల్లే అతను మృతి చెందాడని కథనాలొచ్చాయి.

అయితే తాజాగా ఈ రూమర్లపై రాహుల్‌ దేవ్‌ స్పందించారు. ముకుల్ ఆరోగ్యం క్షీణించడానికి మానసిక ఆరోగ్య సమస్యలు కారణం కాదని తెలిపారు. అతని ఆహారపు అలవాట్లే  కారణమని రాహుల్ దేవ్‌ వెల్లడించారు. చివరి నాలుగైదు రోజు తినడం పూర్తిగా మానేశాడని.. ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతనికి జీవితంపై ఆసక్తి కోల్పోయాడని.. ఎన్ని ఆఫర్స్ వచ్చినా తిరస్కరించేవాడని రాహుల్ దేవ్ వివరించారు.

ఆహారపు అలవాట్లే కారణమా?

2019లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడని రాహుల్ పంచుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి మరణం.. 2023లో తల్లిని కోల్పోవడం అతని ఒంటరితనం మరింత ఎక్కువైందని వెల్లడించారు. ఒంటరిగా జీవించడం పరిస్థితిని మరింత దిగజార్చిందని అతను పేర్కొన్నాడు. ముకుల్ తన కుమార్తెను మిస్ అవుతున్నాడని.. తనను జాగ్రత్తగా చూసుకోవడం లేదని కూడా బాధపడేవాడని రాహుల్ అన్నారు. ముకుల్ మరణం తరువాత సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అతను నిజంగా సూపర్ పవర్‌ అని.. అలాగే సున్నితమైన వ్యక్తిగా గుర్తుంచుకోవాలన్నారు.

సోషల్ మీడియా రూమర్లపై రాహుల్ దేవ్ స్పందన

ఇక సినిమాల విషయానికొస్తే ముకుల్ 1996లో సుష్మితా సేన్ సరసన దస్తక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత  జై హో, హిమ్మత్ వాలా, మేరే దో అన్మోల్ రతన్, యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, భాగ్ జానీ వంటి లాంటి చిత్రాలలో నటించాడు. అంతే కాకుండా ముమ్కిన్, ఘర్వాలీ ఉపర్వాలి, కషీష్, ఫిర్ కోయి హై, కుంకుమ్ ఏక్ ప్యారా సా బంధన్ లాంటి టీవీ సీరియల్స్‌లో నటించారు

ముకుల్ మరణంపై వచ్చిన అవాస్తవ వార్తలను రాహుల్ దేవ్ తోసిపుచ్చారు. ముకుల్ ఒక సూపర్ పవర్ అని, అతని సున్నితమైన స్వభావాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.