|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇకపై కేవలం సినిమాలే! మళ్లీ యాక్టివేట్ అయిన రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్.. మరో ఆసక్తికర పోస్ట్

Published: 04-10-2025, 11:05 AM
ఇకపై కేవలం సినిమాలే! మళ్లీ యాక్టివేట్ అయిన రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్.. మరో ఆసక్తికర పోస్ట్

దసరా నాడు రాజకీయ ట్వీట్లతో దుమారం రేపిన నటుడు రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ఖాతా మళ్లీ యాక్టివేట్ అయింది. ఈసారి రాజకీయ వ్యాఖ్యలకు స్వస్తి పలికి, కేవలం సినిమాలపైనే దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆసక్తికర పరిణామం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

దసరా నాడు రాజకీయ ట్వీట్లతో దుమారం రేపిన రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ఖాతా గతంలో డియాక్టివేట్ చేయబడింది.

2

తాజాగా ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్ చేసి గత రాజకీయ పోస్టులను తొలగించారు.

4

“జై తెలంగాణ, జై హింద్” అంటూ ముగించిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.

రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ రచ్చ.. డీయాక్టివేషన్

ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ (Actor Rahul Ramakrishna) దసరా పండుగ నాడు వరుస ట్వీట్లతో రచ్చ రచ్చ చేసిన ఆయన తన ఖాతాను డీయాక్టివేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను యాక్టివేట్ చేశారు. కేసీఆర్ తిరిగొచ్చే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేసిన రాహుల్.. దుర్భర స్థితిలో బతుకుతున్నామని.. హామీలన్ని విఫలం అయ్యాయని ట్వీట్లు చేశారు. పరోక్షంగా రేవంత్ సర్కార్ చురకలంటించడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. దాంతో.. రాహుల్ ట్విట్టర్ ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడు అతని అకౌంట్ యాక్టివేట్ అవ్వడంతో.. నెటిజన్ల గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరోవైపు పండుగ పూట ప్రభుత్వ పరిపాలన గురించి వేసిన (ట్వీట్‌లు) పోస్టులు అన్ని హైడ్ లేదా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ (శనివారం) గత పోస్టులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

రాజకీయాలకు స్వస్తి.. సినిమాలే నా లోకం

నా కంటే గొప్ప మేధావులు చాలా కాలంగా సామాజిక సమస్యలతో పోరాడుతున్నారని తెలిపారు. పాలన, పరిపాలనల గురించి నాకు ఏమి తెలుసు? నేను ఒక చిన్న నటుడిని మాత్రమే అని తెలిపారు. వివిధ రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత తన అసహనం సరైన దిశలో లేదని తెలుసుకున్నారని తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధే తన ఆకాంక్ష అని, ఎవరు పాలించినా మంచి జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై ట్విట్టర్ ద్వారా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, తన వృత్తిపరమైన పనిపైనే (సినిమా) దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. చివరగా “జై తెలంగాణ, జై హింద్” అంటూ ట్వీట్ చేశారు.

నెటిజన్ల కామెంట్లు, భవిష్యత్తు ప్రణాళిక

ఈ ట్వీట్‌కు కూడా నెటిజన్‌లు, తన అభిమానులు అనేక కామెంట్స్ చేశారు. ఇవన్నీ ‘నీకు ఎందుకు కాక..? చక్కగా సినిమాల్లో జోకులు వేసుకోక’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘తాగినప్పుడు ట్వీట్‌లు వేయకు అన్న’ అని మరో నెటిజన్ విమర్శిస్తూ కామెంట్ పెట్టారు. ‘ఇంతకీ నీకు ఏమైంది అన్న.. ఎందుకు ట్రోల్ అవుతున్నావ్’ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ట్వీట్ ఇదే..

రాహుల్ రామకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం అతని అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇకపై సినిమాలపైనే దృష్టి సారిస్తానని చెప్పడం ద్వారా, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు దూరంగా ఉంటాడో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.