
సీనియర్ నటుడు రాజా రవీంద్ర తన సినీ జీవితంలోని ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆహా కాకమ్మ కథలు షోలో పంచుకున్నారు. ‘నైస్ రాజా’ సినిమా తర్వాత ఆయన ఎదుర్కున్న అనుభవం ఆయన జీవితంలో ఒక మలుపు అని చెప్పవచ్చు.
Key Points
రాజా రవీంద్ర హీరోగా చేసిన 'నైస్ రాజా' సినిమా విడుదల కాలేదు.
సినిమా షూటింగ్‌లో డైరెక్టర్‌ను కలిసినప్పుడు, ముందు హీరోగా ఉన్నప్పుడు మర్యాదలు చేసిన ప్రొడక్షన్ చీఫ్, ఇప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు.
డైరెక్టర్ చిన్న వేషాలు ఇవ్వడంతో రాజా రవీంద్ర నిరాశ చెందాడు.
సినిమా పరిశ్రమలో విజయం లేకుంటే గుర్తింపు లేదని రాజా రవీంద్ర అనుభవం చెప్పింది.
‘నైస్ రాజా’ సినిమా విడుదలకు ముందు, తర్వాత
Raja Ravindra : సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే అందరూ పట్టించుకుంటారు. ఒక్కసారి ఫెయిల్యూర్స్ లోకి వెళ్తే ఎవరూ చూడరు కూడా అని అంతా చెప్తారు. సినీ పరిశ్రమలో సక్సెస్ అయిన అందరూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చినవాళ్లే.
తాజాగా సీనియర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఆహా కాకమ్మ కథలు షోకి రాగా తన జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ క్రమంలో తను ఫేస్ చేసిన ఓ సంఘటన గురించి తెలిపాడు.
డైరెక్టర్‌ను కలిసినప్పుడు ఎదురైన అనుభవం
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మధ్యలో నైస్ రాజా అనే ఒక సినిమా హీరోగా చేశాను. అది రిలీజ్ అయితే హీరోగా అవకాశాలు వస్తాయేమో అని వెయిట్ చేశా కానీ రిలీజ్ అవ్వలేదు. దాంతో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అప్పటికే పెళ్లి అయి పిల్లలు ఉన్నారు. అవకాశాల కోసం వేరే ఒక సినిమా షూటింగ్ దగ్గరికి డైరెక్టర్ ని ఛాన్స్ అడగడానికి వెళ్ళాను. నేను హీరోగా చేసిన నైస్ రాజా సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ చీఫ్ అక్కడ పనిచేస్తున్నాడు. అతను నేను హీరోగా చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ తీయడం, బూస్ట్, జ్యుస్ ఇవ్వడం, అన్ని అందించడం, హీరోకి చేసే మర్యాదలు చేసేవాడు. అక్కడికి వెళ్ళాక చాలా సేపు నిల్చున్నా కనీసం కుర్చీ కూడా వేయలేదు. అతన్ని మంచి నీళ్లు తాగడానికి అడిగాను అతని మళ్ళీ నాకు కనపడకుండా వెళ్లిపోయాడు. ఇక డైరెక్టర్ నువ్ హీరోగా చేస్తున్నావు చిన్న వేషాలు ఇచ్చి నిన్ను తగ్గించాను అనడంతో వెళ్ళిపోయా. ఇక్కడ సక్సెస్ ఉంటేనే గుర్తింపు అని ఆ రోజు రియలైజ్ అయ్యాను అని తెలిపాడు.
సినిమా పరిశ్రమలో విజయం, గుర్తింపుల ప్రాముఖ్యత
రాజా రవీంద్ర అనుభవం సినీ పరిశ్రమలో విజయం ఎంత ముఖ్యమో చాటుతుంది. సక్సెస్ లేకుంటే ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తారని ఆయన అనుభవం వెల్లడిస్తుంది.


