|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజాసాబ్ పార్ట్-2 టైటిల్ లీక్: ప్రభాస్ జోకర్ అవతార్! ఊహించని ట్విస్ట్!!

Published: 09-01-2026, 2:30 AM
రాజాసాబ్ పార్ట్-2 టైటిల్ లీక్: ప్రభాస్ జోకర్ అవతార్! ఊహించని ట్విస్ట్!!
  • ప్రభాస్ ఫన్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, డ్యాన్సులతో రాజాసాబ్ అదుర్స్!
  • రాజాసాబ్ పార్ట్-2 టైటిల్ ఫిక్స్: ‘రాజాసాబ్ సర్కస్:1935’ – జోకర్ అవతార్‌లో ప్రభాస్!
  • సంజయ్ దత్ పాత్రకు మరింత బలం చేకూర్చాల్సింది, నిధి, మాళవిక, రిద్ధి గ్లామర్ మెరుపులు!
  • క్లైమాక్స్, నిర్మాణ విలువలు బాగున్నా కథలో డైరెక్షన్ లోపాలు కనిపించాయి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, మేకర్స్ మాత్రం పార్ట్-2తో వస్తున్నారు. పార్ట్-2 టైటిల్ ఏంటో తెలుసా? ఇది నిజంగా షాకింగ్ అప్డేట్!

రాజాసాబ్ పార్ట్-2: టైటిల్ ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ మారుతి(Maruti) కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’(Raja Saab) మూవీ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. ప్రభాస్ ఫన్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, డ్యాన్సులు.. ఇలా కలర్ ఫుల్ అవతార్‌లో కనిపించి మెప్పించినప్పటికీ సంజయ్ దత్ పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్‌కి డైరెక్టర్ ఇంకా బలంగా రాయాల్సింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తెరపై అందంగా కనిపించినప్పటికీ ఆ పాత్రలు కథలో మిళితం కాలేదు.

అంతేకాకుండా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్, నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ డైరెక్షన్స్‌లో లోపాల వల్ల కథ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రాజాసాబ్ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పార్ట్-2 టైటిల్‌ను ‘రాజాసాబ్ సర్కస్:1935’గా ఖరారు చేసినట్లు మూవీ ఎండింగ్‌లో వెల్లడించారు. ఈ పార్ట్-2లో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఇది ప్రీక్వెలా లేదా సీక్వల్‌గా తెరకెక్కతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ట్రైలర్‌లో ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో కనిపించిన సీన్స్ ఈరోజు రిలీజ్ అయిన సినిమాలో లేవు.. దీన్ని బట్టి చూస్తే అవి నెక్స్ట్ పార్ట్‌లో ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

జోకర్ గెటప్‌లో ప్రభాస్: ఇది సీక్వెలా ప్రీక్వెలా?

పార్ట్-1లో మిస్ అయిన ఓల్డ్ మ్యాన్ లుక్.. పార్ట్-2లో!

రాజాసాబ్ పార్ట్-2 టైటిల్ అనౌన్స్మెంట్తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ జోకర్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.