|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజా సాబ్ టికెట్ల కుట్ర: ప్రభాస్ సినిమాను కావాలనే ముంచేశారా?

Published: 10-01-2026, 12:00 PM
రాజా సాబ్ టికెట్ల కుట్ర: ప్రభాస్ సినిమాను కావాలనే ముంచేశారా?
  • రాజా సాబ్ టికెట్ల వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
  • చిరంజీవి సినిమాకు అనుకూలంగా రాజా సాబ్ సినిమాను బలి చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
  • సినిమాటోగ్రఫీ మంత్రి రోహిణ్ రెడ్డి పాత్ర ఉందని కొందరు విమర్శిస్తున్నారు.
  • చిరంజీవి సినిమా మెమోను హైకోర్టు సెలవుల్లో విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందని అనుమానాలు ఉన్నాయి.

సంక్రాంతి సినిమాల సందడిలో రాజా సాబ్ టికెట్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. టికెట్ రేట్ల పెంపులో గందరగోళం నెలకొనడంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజా సాబ్ టికెట్ల ధరల గందరగోళం

The Raja Saab Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటే ఎప్పుడూ భారీ అంచనాలే. ఈ ఏడాది కూడా సంక్రాంతికి దాదాపు ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే అందులో స్టార్ హీరోల సినిమాలు.. మాత్రం రెండు ఉన్నాయి. ఒకటి చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కాగా.. మరోటి ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్.

ప్రభాస్ సినిమా జనవరి 9న విడుదల కాగా చిరంజీవి సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమా టికెట్ ధరల విషయంలో భారీ గందరగోళం నెలకొంది. సినిమా విడుదలకు ముందు నుంచే టికెట్ రేట్లు.. పెంచుకునే అనుమతులపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రీమియర్ షోలు..మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం పడిందనే అభిప్రాయం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఒక రకంగా తెలంగాణలో టికెట్ రేట్ వివాదం లేకుంటే ఈ సినిమా ప్రీమియర్లకు మరిన్ని కలెక్షన్స్ వచ్చి ఉంటాయి. ఈ నేపథ్యంలో..ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

వైరల్ అవుతున్న వార్తల ప్రకారం..ఒకే రోజు రెండు సినిమాలకు.. అనగా మన శంకర్ వరప్రసాద్ గారు అలానే రాజా సాబ్ రెండు సినిమాలకు.. సంబంధించిన మెమోలు తయారైనప్పటికీ.. ప్రభాస్ సినిమా రాజా సాబ్ మెమోను చివరి వరకూ ఆపి ఉంచారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి సినిమా కోసం జనవరి 8న తయారు చేసిన మెమోను.. కూడా బయటకు విడుదల చేయకుండా 10వ తేదీ వరకు నిలిపి ఉంచారని సమాచారం. దీనివల్ల ముందే విడుదలైన ప్రభాస్ సినిమా జీవోపై మాత్రమే కోర్టులో స్టే పడింది. అదే సమయంలో సంక్రాంతి సెలవుల కారణంగా చిరంజీవి.. సినిమా మెమోపై స్టే పడే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు.

చిరంజీవి సినిమా కోసం రాజా సాబ్‌ను బలి?

ఇంకా కొందరు..మన శంకర్ వరప్రసాద్ సినిమాకు అనుకూలంగా ఉండేందుకు రాజా సాబ్ సినిమాను కావాలనే బలి చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో షాడో సినిమాటోగ్రఫీ మంత్రి రోహిణ్ రెడ్డి పాత్ర ఉందని కూడా కొందరు విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ 8వ తేదీన మెమో సిద్ధం చేసినా..బయటకు రానివ్వలేదని సినీ వర్గాలు అంటున్నాయి.

అదే సమయంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు మాత్రం అర్ధరాత్రి జీవో విడుదల చేసి టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు సెలవులు ఉన్న సమయంలోనే చిరంజీవి సినిమా మెమోను విడుదల చేశారని.. ఇలా చేయడం వెనుక వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విమర్శల్లో సినిమాటోగ్రఫీ మంత్రి రోహిణ్ రెడ్డి

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్‌పై ఇలా వివక్ష చూపడం ఎందుకని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇండస్ట్రీలో రాజకీయాలు ఎంత ప్రభావం చూపుతున్నాయో మరోసారి బయటపెట్టిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

మొత్తానికి రాజా సాబ్ టికెట్ల వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపింది. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.