
📌 Key Points
- రాజమౌళి ‘మహాభారతం’లో బాలయ్యకు దుర్యోధనుడి పాత్ర? సంచలన చర్చలు!
- జక్కన్న సినిమాలో బాలయ్య పాత్రపై అంచనాలు.. అభిమానుల్లో ఉత్కంఠ!
- బాలయ్యను హ్యాండిల్ చేయడం కష్టమన్న రాజమౌళి.. అసలు నిజం ఇదే!
- వారణాసి తర్వాత ‘మహాభారతం’పై జక్కన్న ఫోకస్.. భారీ అప్డేట్!
టాలీవుడ్ లో ఒక సంచలనం! రాజమౌళి దర్శకత్వంలో ‘మహాభారతం’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా నటించనున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
రాజమౌళితో బాలయ్య కాంబో.. అసలు సంగతేంటి?
రాజమౌళి తన కెరీర్ లో యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. టాలీవుడ్ నాలుగు పిల్లర్స్ అయిన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జునతో జక్కన్న సినిమాలు చేయలేదు. అయితే ఈ నలుగురిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య తో రాజమౌళి సినిమా గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వీరి కాంబోలో సినిమాలు ఎప్పుడు వస్తాయా అని అంతా ఎదురు చూశారు. ముఖ్యంగా బాలయ్యతో రాజమౌళి కాబినేషన్ గురించి ఎక్కువగా ఇండస్ట్రీలో చర్చించుకున్నారు. ఓ సందర్భంలో రాజమౌళి బాలయ్యతోసినిమా గురించి స్పందించారు. బాలయ్య కూడా రాజమౌళిని ఈ విషయంపై ప్రశ్నించారు.
గతంలో జరిగిన అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ రాజమౌళిని ఇంటర్వ్యూ చేస్తూ.. వారి కాంబినేషన్ గురించి అడిగారు. బాలయ్య మాట్లాడుతూ.. ” మన కాంబినేషన్ గురించి చాలా కాలంగా డిస్కర్షన్ నడుస్తోంది. నా అభిమానులు కూడా అడుగుతున్నారు.. కానీ నన్ను హ్యాండిల్ చేయలేను అన్నావట కదా.. ఏంటి సంగతి. ” అని అడిగారు. రాజమౌళి స్పందిస్తూ.. ” మీకు కోపం ఎక్కువ అని.. ఎవరిని పడితే.. వారిని కొడతారని, ఎంతటివారినైనా లెక్క చేయరని అంతా అంటుంటారు. కానీ మీ మంచితనం మంచి మనసు గురించి చాలామందికి తెలియదు. దర్శకులకు మీరు ఎంత విలువిస్తారో మాకు తెలుసు. డైరెక్టర్ ఎంత చిన్నవారైనా.. వారు చెప్పిందే ఫైనల్.. దర్శకుడు ఏం చెపితే అది చేస్తారు.. ఆయన పేకప్ అన్న తరువాతే క్యారెవాన్ ఎక్కుతారు. ” అని బాలయ్య గొప్పతనం గురించి వివరించారు.
బాలయ్యకు దుర్యోధనుడి పాత్ర ఫిక్స్ అయినట్టేనా?
వారణాసి సినిమాతో మరోసారి సంచలనం సృష్టించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు రాజమౌళి.. ఈ సినిమా అనంతరం ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మహాభారతం లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక పాత్ర ఇవ్వాలనే రాజమౌళి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనే విషయంపై అధికారిక స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బాలకృష్ణకు తెలుగు భాషపై ఉన్న పట్టు, పురాణ పాత్రలపై ఆయనకున్న ఆసక్తి దృష్ట్యా ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఆయనను భాగస్వామ్యం చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
‘మహాభారతం’ కోసం జక్కన్న ప్లాన్స్.. బాలయ్యకు ఛాన్స్!
మహాభారతంలో అనేక ప్రధాన పాత్రలు ఉన్న నేపథ్యంలో బాలకృష్ణకు సరిపోయే పాత్రలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దుర్యోధనుడి పాత్ర కానీ, ధర్మరాజు పాత్ర కానీ.. చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ. సోషల్ మీడియాలో మాత్రం మ్యాటర్ వైరల్ అవుతోంది.
రాజమౌళి తన సన్నిహితులతో కొన్ని సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. నిజంగా ‘వారణాసి’ సినిమా అనంతరం ‘మహాభారతం’ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, పలువురు స్టార్ హీరోలు తమ డేట్స్‌ను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు వారణాసి రిలీజ్ తరువాతే వచ్చే అవకాశం ఉంది.
రాజమౌళి ‘మహాభారతం’లో బాలయ్య పాత్ర గురించి వస్తున్న వార్తలు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

