|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ అవుతుందా? ప్రియాంక షాకింగ్ కామెంట్స్! అసలేం జరిగింది?

Published: 04-02-2026, 3:05 AM
రాజమౌళి 'వారణాసి' రిలీజ్ అవుతుందా? ప్రియాంక షాకింగ్ కామెంట్స్! అసలేం జరిగింది?
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రం కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు.
  • ప్రియాంక చోప్రాకి రాజమౌళి ఇచ్చిన హామీ ఏమిటంటే ఆమెను తెరపై అద్భుతంగా చూపిస్తానని భరోసా ఇచ్చారు.
  • ప్రియాంక చోప్రా ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నారు.
  • రాజమౌళి విజన్ స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్‌ల స్థాయికి ఏమాత్రం తీసిపోదని ప్రియాంక అన్నారు.

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడం విశేషం. రాజమౌళి ఆమెకు ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమిటో తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా ఆందోళన

Varanasi Update: ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం “వారణాసి” (Varanasi). ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. అయతే రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక, పృధ్వీ రాజ్ కలిసి గ్లోబల్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్య్వూలో సినిమా గురించి చెప్పిన విశేషాలు ప్రస్తుంతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమా గురించి పలు అప్డేట్లు ఇచ్చిన రాజమౌళి ఈ ఇంటర్య్వూలో సినిమా గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు. మెదటి సారి ప్రియాంక చోప్రా జోనస్ రాజమౌశిని కలిసినపుడు అసలు ఏం అనుకున్నారు.. రాజమౌళి ప్రియాంక చోప్రకు ఇచ్చిన మాట ఏమిటి? అన్నది ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also- Samyukta Menon : షూటింగ్ లో గాయపడ్డ సంయుక్త.. తృటిలో తప్పిన ప్రమాదం..!

రాజమౌళి ఇచ్చిన భరోసా

ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టుల తర్వాత చాలా కాలానికి ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి సంతకం చేశారు. తనకు తెలుగు రాకపోవడం వల్ల, డైలాగుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పడతానో, తన నటన సహజంగా ఉంటుందో లేదో అని ఆమె మొదట చాలా ఆందోళన చెందానని చెప్పుకొచ్చారు. కానీ ‘రాజమౌళి ఇచ్చిన ధైర్యం తనకు ఎంగానో ఉపయోగ పడిందన్నారు. హైదరాబాద్‌లోని రాజమౌళి కార్యాలయంలో మెదటి సారి కలిసినపుడు ఆయన కేవలం కథను మాత్రమే చెప్పలేదు, ఒక నటిగా ఆమెకు పూర్తి భద్రతను కల్పించారు. “నిన్ను అత్యుత్తమంగా చూపించడమే నా బాధ్యత” అని మాట కూడా ఇచ్చారన్నారు. ఆయన చెప్పడం వెనుక అర్థం ఏమిటంటే.. భాష ఏదైనా, భావం పండించే బాధ్యత తనది అని ఆయన హామీ ఇచ్చారు. రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను, ప్రతి ఫ్రేమ్‌ను పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. అదే విషయాన్ని ఆయన ప్రియాంకకు నొక్కి చెప్పారు. ఆమె కెరీర్‌లోనే ఇది ఒక గొప్ప పాత్ర అవుతుందని ఆయన నమ్మకాన్ని కలిగించారు.

Read also- Varanasi Film: వారణాసి రెండు భాగాలు కాదు..రన్ టైమ్ తో సహా బయట పెట్టిన జక్కన్న!

ప్రపంచ స్థాయి విజన్

అంతే కాకుండా ఆమె రాజమౌళిని స్టీవెన్ స్పీల్ బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ దర్శకులతో పోల్చడానికి కారణం ఆయన విజన్. ఆ సమావేశం తర్వాతే ప్రియాంకకు ఈ సినిమా కేవలం ఒక ప్రాంతీయ చిత్రం కాదని, ఇది ప్రపంచ స్థాయికి వెళ్లే ఒక గొప్ప “అండర్‌టేకింగ్” అని అర్థమైంది. తనపై నమ్మకం ఉంచిన దర్శకుడి కోసం ఆమె కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే ఆఫ్రికా అడవుల్లో కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆమె వెనకడుగు వేయకుండా నటించారు. మొత్తానికి, రాజమౌళి ఇచ్చిన ఆ ఒక్క మాట ప్రియాంకను కేవలం నటిగానే కాకుండా, ఆ సినిమా విజన్ కోసం కష్టపడే ఒక సైనికురాలిగా మార్చేసింది. ప్రియాంకను సరిగ్గా చూపించకపోతే ఒక్క ప్రేమ్ కూడా బయటకు రానివ్వను అని రాజమౌళి అన్నట్లుగా తెలుస్తొంది.

రాజమౌళి ప్రియాంకకు ఇచ్చిన మాట నెరవేరుస్తారా లేదా అనేది వేచి చూడాలి. వారిద్దరి కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.