|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డార్లింగ్ ఫ్యాన్స్ కు మళ్లీ షాక్ తప్పదా? రాజాసాబ్ రిలీజ్ మరోసారి వాయిదా.. ప్రొడ్యూసర్ చెప్పింది ఇదే!

Published: 06-08-2025, 4:41 AM
డార్లింగ్ ఫ్యాన్స్ కు మళ్లీ షాక్ తప్పదా? రాజాసాబ్ రిలీజ్ మరోసారి వాయిదా.. ప్రొడ్యూసర్ చెప్పింది ఇదే!

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ తేదీపై అనిశ్చితి నెలకొంది. డిసెంబర్ 5 రిలీజ్ డౌట్ లో ఉండగా, సంక్రాంతికి మార్చే అవకాశం ఉందని ప్రొడ్యూసర్ తెలిపారు.

Key Points

1

రాజాసాబ్ విడుదల తేదీ సంక్రాంతికి మారే అవకాశం ఉంది.

2

వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయిన తర్వాతే రిలీజ్ తేదీ ఖరారు అవుతుంది.

4

రాజాసాబ్ కి సీక్వెల్ ఉంటుందని, కానీ అదే కథ కంటిన్యూ కాదని ప్రొడ్యూసర్ వెల్లడించారు.

రాజాసాబ్ రిలీజ్ వాయిదా?

డార్లింగ్ ప్రభాస్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ అదిరిపోయాడు. అతని వింటేజీ లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ కు షాక్ తగిలేలా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కామెంట్లున్నాయి. నిజానికి ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది.

ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ రాజాసాబ్ ‘ 2022 నుంచి నిర్మాణంలోనే ఉంది. వీఎఫ్ఎక్స్ కారణంగా రిలీజ్ లేట్ అయిందని ప్రొడ్యూసర్లు ఇప్పటికే చెప్పారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలను సంక్రాంతికి మార్చే అవకాశం ఉందని గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

సంక్రాంతి రిలీజ్ అవకాశాలు?

రాజా సాబ్ రిలీజ్ సంక్రాంతికి షిఫ్ట్ అవుతుందా? డిసెంబర్ లో రాజా సాబ్ అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని విశ్వను అడగ్గా.. ‘‘చూడండి.. ఈ విషయాన్ని నేను బహిరంగంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతికి విడుదల చేయాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తెలుగు వ్యాపార వర్గాల మాదిరిగానే అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. జనవరి 9న విడుదల చేయాలనే బలమైన ప్రతిపాదన ఉంది’’ అని అన్నారు.

రణ్ వీర్ సింగ్ నటించిన హిందీ సినిమా ధురంధర్ కూడా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్వ ప్రసాద్ తెలిపారు. అయితే హిందీ బిజినెస్ సర్కిల్ మాత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలని భావిస్తోందని, ఎందుకంటే అప్పుడు పెద్దగా విడుదల చేసే సినిమాలు లేవు. మరి రాజాసాబ్ తప్పుకొంటే ధురంధర్ కు మరింత లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది.

సినిమా నిడివి మరియు భవిష్యత్తు ప్రణాళికలు

అక్టోబర్ కల్లా సినిమా రెడీ అవుతుందని, అప్పుడు రాజాసాబ్ రిలీజ్ పై నిర్ణయం తీసుకుంటామని విశ్వప్రసాద్ చెప్పారు. 4 గంటల 30 నిమిషాల నిడివి గల ఈ సినిమాకి సంబంధించిన ఫుటేజ్ తమ వద్ద ఉందని దాన్ని.. 2 గంటల 45 నిమిషాలు లేదా 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ను మారుతి నిర్ణయిస్తారని విశ్వ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, అయితే అదే కథను కంటిన్యూ చేయబోమని, అదే యూనివర్స్ లో సాగే డిఫరెంట్ స్టోరీని చూపిస్తామని నిర్మాత తెలిపారు. రాజా సాబ్ ఒక హారర్ కామెడీ చిత్రం.

రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ (తెలుగు సినీ అరంగేట్రం), రిద్ధి కుమార్ లతో పాటు ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా నిర్మాణంలో జాప్యం కారణంగా వాయిదా పడింది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

చివరి నిర్ణయం అక్టోబర్ నాటికి తీసుకోనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు. రాజాసాబ్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.