|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ హీరోకి ఓపెన్‌గా వార్నింగ్‌ ఇచ్చిన రాజశేఖర్‌.. మరో హీరోతో కోల్డ్ వార్‌.. ముగ్గురి మధ్య ఇంత జరిగిందా?

Published: 27-10-2025, 5:18 AM
స్టార్‌ హీరోకి ఓపెన్‌గా వార్నింగ్‌ ఇచ్చిన రాజశేఖర్‌.. మరో హీరోతో కోల్డ్ వార్‌.. ముగ్గురి మధ్య ఇంత జరిగిందా?

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సినీ కెరీర్, వివాదాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్న ఆయనకు, వాయిస్ ఓవర్ విషయంలో సాయికుమార్, సుమన్‌లతో జరిగిన సంఘర్షణలు చర్చనీయాంశమయ్యాయి. ఓ స్టార్ హీరోకి వార్నింగ్ ఇవ్వడం వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.

Key Points

1

రాజశేఖర్‌ ఒకప్పుడు స్టార్ హీరో, ప్రస్తుతం కెరీర్ గ్రాఫ్‌ కొంత డౌన్ అయింది.

2

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, చిరంజీవితో గతంలో వివాదాలు, తారాచౌదరీ కేసులో పేరు వినిపించింది.

4

వాయిస్ ఓవర్ విషయంలో సుమన్‌తో క్లాష్, వార్నింగ్ ఇచ్చాడని సాయికుమార్ వెల్లడించారు.

రాజశేఖర్‌ సినీ కెరీర్, వివాదాలు

యాంగ్రీ యంగ్‌ మేన్‌గా పేరుతెచ్చుకున్న రాజశేఖర్‌ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణించిన విషయం తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరు. కానీ ఇటీవల కాలంలో కాస్త డౌన్‌ అయ్యారు. ఆయన నటించిన సినిమాలు వరుస పరాజయాలు కావడంతో కొంత డౌన్‌ కావాల్సి వచ్చింది. దీంతో హీరోగా కొంత గ్యాప్‌ ఇచ్చారు. సరైన సబ్జెక్ట్ లు రాకపోవడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే సెకండ్‌ ఇన్నింగ్స్ గ్రాండ్‌ గా ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలతో రాబోతున్న ప్రచారం జరుగుతుంది. అందులోనూ ఓ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం.

రాజశేఖర్ జీవితంలో చాలా వివాదాలున్నాయి. ఆయన సినిమాల షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారని పలువురు కామెంట్లు చేశారు. దీనికితోడు ప్రారంభంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో గొడపడ్డారు. ఆ తర్వాత చిరంజీవితో గొడవ జరిగింది. రాజకీయ గొడవల్లోనూ భాగమయ్యాడు. తారాచౌదరీ కేసులోనూ ఆయన పేరు వినిపించింది. ఇవన్నీ ఆయన్ని కొంత డిస్టర్బ్ చేశాయి. దీనికితోడు సినిమాలు ఆడకపోవడం మరికొంత ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. మళ్లీ కెరీర్‌ని గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

వాయిస్ ఓవర్: సాయికుమార్, సుమన్‌లతో క్లాష్

రాజశేఖర్‌ తిరుగులేని స్టార్‌గా ఎదగడంలో ఆయన వాయిస్‌ ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. తన సినిమాల్లో వాడే వాయిస్‌ ఆయనది కాదు, చాలా వరకు సాయికుమార్‌ డబ్బింగ్‌ చెప్పారు. రాజశేఖర్‌ కి అంతటి మాస్‌ ఇమేజ్‌ వచ్చిందన్నా, ఆ డైలాగ్‌ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారన్నా అందులో సాయికుమార్‌ పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. రాజశేఖర్‌ సొంత వాయిస్‌ సినిమాల్లో సెట్‌ కాదు. ఆయనకు కొంత నత్తి ఉండటం, తెలుగులో క్లారిటీ లేకపోవడం, బేస్‌వాయిస్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. అందుకే చాలా వరకు సాయికుమార్‌ వాయిస్‌తోనే సినిమాలు చేశారు.

కానీ మధ్యలో సాయికుమార్‌ హీరో అయ్యాడు. ఆయన కూడా మాస్‌ సినిమాలు చేశారు. మరోవైపు సుమన్‌కి వాయిస్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ల మధ్య కొంత క్లాష్‌ వచ్చింది. రాజశేఖర్‌కి వాయిస్‌ ఇవ్వొద్దని సుమన్‌ అనేవాడట. సుమన్‌కి ఇవ్వొద్దని రాజశేఖర్‌ అనేవాడట. సుమన్‌ కూల్‌గా చెబితే, రాజశేఖర్‌ మాత్రం ఆవేశానికి గురయ్యేవాడట. ఈ క్రమంలో వార్నింగ్‌ కూడా ఇచ్చినట్టు తెలిపారు సాయికుమార్‌. `రాజశేఖర్‌ చాలా ఎమోషనల్‌..  వాయిస్‌ ఇవ్వను అంటే రేయ్‌ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చాడ`ని తెలిపారు. ఓపెన్‌ హార్ట్ వీత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు సాయికుమార్‌.

సాయికుమార్ చెప్పిన షాకింగ్ నిజాలు

ఇదిలా ఉంటే సాయికుమార్‌ హీరోగా చేసే క్రమంలో తాను ఎవరికీ వాయిస్‌ ఇవ్వనని అన్నాడట. అటు సుమన్‌, ఇటు రాజశేఖర్‌కి కూడా డబ్బింగ్‌ చెప్పనని ప్రకటించారట. ఆ సమయంలో రాజశేఖర్‌ చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పినా సెట్‌ కాలేదు. ఈ విషయం సాయికుమార్‌ అమ్మకి తెలిసింది. ఆమె చాలా బాధపడింది. అలా చేయోద్దని, రాజశేఖర్‌కి, సుమన్‌కి వాయిస్‌ ఇవ్వు అని చెప్పిందట. దీంతో మళ్లీ ఇద్దరికీ వాయిస్‌ ఇస్తూ వచ్చారు సాయికుమార్‌. అయితే వాయిస్‌ బేస్‌లో చిన్న మార్పు చేసి ఇద్దరినీ మ్యానేజ్‌ చేశాడట సాయికుమార్‌. ఆర్కే ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. మొత్తంగా సాయికుమార్‌ వాయిస్‌ కోసం రాజశేఖర్‌, సుమన్‌ మధ్య అప్పట్లో కోల్డ్ వార్‌ జరిగిందట. ఈ కారణంగా మధ్యలో సాయికుమార్‌ నలిగిపోవాల్సి వచ్చింది.

మొత్తంగా, రాజశేఖర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు, వివాదాలు, వాయిస్ ఓవర్ కళాకారులతో ఏర్పడిన సంఘర్షణలు సినిమా ప్రపంచంలో ఎంతటి సంచలనం సృష్టించాయో ఈ కథనం స్పష్టం చేస్తుంది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.