
📌 Key Points
- రాజశేఖర్ ‘బైకర్’ సినిమాలో నటించడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు.
- శర్వానంద్ తనను తాత అని పిలవడం ఫీలయ్యానని రాజశేఖర్ వెల్లడి.
- షూటింగ్ సమయంలో శర్వానంద్ తండ్రిలా చూసుకున్నాడని రాజశేఖర్ పేర్కొనడం.
- సినిమాలో నటించడం కెరీర్‌కు ప్లస్ అవుతుందా అని ఆలోచించానని తెలిపారు.
సినీ నటుడు రాజశేఖర్ చాలా రోజుల తర్వాత ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ శర్వానంద్ గురించి, సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రాజశేఖర్ ‘బైకర్’ సినిమా అనుభవాలు
Rajashekhar: సినీ నటుడు రాజశేఖర్ చాలా రోజుల తర్వాత బైకర్(Biker) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ (Sharwanand) మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రాజశేఖర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముందుగా తనకు ఈ సినిమాలో ఇలాంటి మంచి పాత్ర కల్పించినందుకు నిర్మాత వంశీ డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. బైకర్ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకుందని తనకు ఇలాంటి ఇంకా మంచి మంచి పాత్రలలో నటించాలని ఉందని తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్లో శర్వానంద్ నన్ను చాలా బాగా చూసుకున్నారని రాజశేఖర్ తెలిపారు. ఇకపోతే తన గురించి రాజశేఖర్ మాట్లాడుతూ తన ఇంట్లో మా అక్క పిల్లలు నన్ను డాక్టర్ మామయ్య అని పిలుస్తారు. వాళ్ల పిల్లలు నన్ను తాత అని పిలవరు వాళ్లు కూడా డాక్టర్ మామయ్య అనే పిలుస్తారు.
శర్వానంద్ గురించి రాజశేఖర్ ఏమన్నారంటే?
సాధారణంగా నాకు తాతయ్య అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ కుర్రాడు వచ్చి తాతయ్య అని పిలవగానే చాలా ఫీల్ అయ్యానని రాజశేఖర్ తెలిపారు. ఇదేంటి మా చుట్టాలు ఎవరూ కూడా నన్ను తాత అని పిలవరు కానీ ఈ సినిమా ద్వారా నేను తాత అని పిలిపించుకోవడం అందరూ చూస్తారు అనవసరంగా ఈ సినిమా చేశానా అని చాలా ఫీల్ అయ్యానని రాజశేఖర్ తెలిపారు. కానీ ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సంతోషంగా ఉందని, ఇలాంటి మరిన్ని మంచి సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాజశేఖర్ తెలిపారు.
నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను..
సినిమా కెరీర్‌పై రాజశేఖర్ ఆలోచనలు
ఇక శర్వానంద్ షూటింగ్ లొకేషన్లో నన్ను ఒక తండ్రి లాగే చూసుకున్నారు ఇందాక మా అమ్మాయిలతో గొడవపడి నేను నా కొడుకు (శర్వానంద్) దగ్గరికి వెళ్లిపోతానని బెదిరించాను అంటూ సరదాగా చెప్పారు. అయితే ఈ సినిమాకు కమిట్ అయినప్పుడు కాస్త ఆలోచించానని రాజశేఖర్ తెలిపారు. శర్వానంద్ చాలా విభిన్నమైన కథలను ఎంచుకుంటారు అయితే ఈ సినిమాలో నటిస్తే కెరియర్ పరంగా నాకు ప్లస్ అవుతుందా లేదా అని చాలా ఆలోచించి ఈ సినిమాలో భాగమయానని ఈ సందర్భంగా రాజశేఖర్ బైకర్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఈయన శర్వానంద్ తండ్రిగా సునీల్ నారంగ్ అనే పాత్రలో నటించారు. ఈ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
రాజశేఖర్ ‘బైకర్’ సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన ముందు ముందు మరిన్ని మంచి పాత్రలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో ఆయన మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


