|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజేంద్రప్రసాద్‌ ఊహించని అవతార్! `క్విక్‌ గన్‌ మురుగన్‌`గా నటకిరీటి మాస్ రచ్చ!

Published: 09-05-2026, 6:31 PM
రాజేంద్రప్రసాద్‌ ఊహించని అవతార్! `క్విక్‌ గన్‌ మురుగన్‌`గా నటకిరీటి మాస్ రచ్చ!
  • నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ `క్విక్‌ గన్‌ మురుగన్‌`గా `పాంచాలి పంచభర్తృక`లో మెయిన్ లీడ్.
  • `సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట` సాంగ్ వైరల్, భారీ రెస్పాన్స్.
  • రోల్ రైడా, జెమినీ సురేష్, రాజ్‌ పవన్‌, వెంకట్‌ దుగ్గిరెడ్డి కీలక పాత్రల్లో.
  • దర్శకుడు గంగ సప్తశిఖర కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మళ్లీ హీరోగా అలరించడానికి సిద్ధమయ్యారు! `పాంచాలి పంచభర్తృక`లో ఆయన `క్విక్‌ గన్‌ మురుగన్‌`గా చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని టీమ్ చెబుతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

రాజేంద్రప్రసాద్‌ రీ-ఎంట్రీ: క్విక్‌ గన్‌ మురుగన్‌గా మాస్ అవతార్!

ఒకప్పుడు కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్నాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌.  స్టార్‌ హీరోగా రాణించాడు. ఇప్పుడు కీలక పాత్రలతో మెప్పిస్తున్నాడు.  ఈ క్రమంలో మరోసారి ఆయన హీరోగా నటిస్తున్నాడు. `పాంచాలి పంచభర్తృక` అనే చిత్రంలో ఆయన మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నారు. ఇందులో ఆయన క్విక్‌ గన్‌ మురుగన్‌ అనే పాత్రలో కనిపించబోతుండటం విశేషం. దీనికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు. రోయల్ థ్రోన్ ప్రొడక్షన్స్ , ఓం సాయిరాం ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ పవన్‌, వెంకట్‌ దుగ్గిరెడ్డి యూఎస్‌ఏ నిర్మాతలు.

`సెనోరిటా రాసిస్తా` సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

`పాంచాలి పంచభర్తృక` మూవీ విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఇటీవల సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట` అనే పాటని విడుదల చేశారు. దీనికి విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం రియాక్ట్ అయ్యింది. రాజేంద్రప్రసాడ్‌ మాట్లాడుతూ,  `ఈ మధ్య కాలంలో నాకు ఇలాంటి పాత్ర రావడం చాలా అరుదు , ఈ సినిమాలో పాట , ఫైట్ లతో మళ్ళీ మీ అప్పటి రాజేంద్రప్రసాద్ ని చూస్తారు` అని  అన్నారు. ఈ సినిమాలో మొదటి సారి హీరో పాత్రలో కనిపించబోతున్న రాప్ సెన్షేషన్ రోల్ రైడా మాట్లాడుతూ, `సినిమా మొత్తం నవ్వుతూనే చూస్తారు, ప్రేక్షకుడికి మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా` అని తెలిపారు .

కామెడీ రచ్చకు రెడీ అవ్వండి: టీమ్ మెంబర్స్ మాటలు!

`ఆరోగ్యవంతమైన కామెడీ తెలుగు ప్రేక్షకులు చూసి చాలా రోజులైంది , ఇంత మంచి కామెడీ రైటింగ్ రాయడం ఒక ఎత్తు అయితే ఆ టైమింగ్ లో నటించడం మాకు సవాలే` అని మరో హీరోగా నటించిన జెమినీ సురేష్ చెప్పారు. `సెటిల్డ్ కామెడీ తో మెప్పించడం కొత్త నటుడిగా నాకు ఒక పరీక్షా , నా నటనతో ఆ పరీక్షా పాసయ్యాను అనే చెప్పాలి` అని కొత్తగా పరిచయం అవ్వబోతున్న హీరో రాజ్ పవన్ అన్నారు. `నెల్లూరు యాసలో కామెడీ చెయ్యడం అనేది నాకు వ్యక్తిగతంగా సరిపోయే పాత్ర , ఇలాంటి పాత్రలు చేసినప్పుడు మనలో ఉన్న అసలు నటుడు బయటికి వస్తాడు , ప్రేక్షకులని మెప్పిస్తాడు` అని హీరోల్లో ఒకరైన వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ చెప్పారు. వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ తో కలిసి ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీలో రాజి పడకుండా ఈ సినిమాని నిర్మించినట్టు నిర్మాతల్లో ఒకరైన రాజ్ పవన్ తెలిపారు . `బాబీ అందించిన బలమైన కథ చెప్పడానికి కామెడీ ని ఎంచుకున్నాను, రెండు గంటలు ప్రేక్షకులని నవ్వించడం పెద్ద టాస్క్ , టీం వర్క్ తో అది సాధ్యం అయింది , ప్రేక్షకులకి నచ్చే మెచ్చే సినిమా ఈ పాంచాలి పంచభర్తృక` అని సినిమా దర్శకుడు గంగ సప్తశిఖర తెలిపారు.

`పాంచాలి పంచభర్తృక` సినిమాతో రాజేంద్రప్రసాద్‌ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం. ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం వేచి చూడండి, మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.