
📌 Key Points
- రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు ఫలిస్తాయి.
- ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12:07 గంటలకు సినిమా ప్రోమో విడుదల కానుంది.
- రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
- ప్రోమోలో ‘కొందరు రూల్స్ సెట్ చేస్తే… కొందరు మాత్రమే పాలిస్తారు’ అనే స్టోరీ హింట్ ఇచ్చారు.
దక్షిణాది సినీ అభిమానులకు ఒక శుభవార్త. రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమాకు సంబంధించిన ప్రోమో త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రోమో ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
రజినీకాంత్, కమల్ హాసన్ మూవీ క్రేజీ అప్డేట్
Rajinikanth -Kamal Hassan: సౌత్ సినీ ప్రేక్షకులు ముఖ్యంగా కోలీవుడ్ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రజినీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు భావించారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతుందని తెలుస్తోంది. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తెలియజేశారు.
రజనీకాంత్ కమల్ హాసన్ హీరోలుగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ప్రోమో వీడియో త్వరలోనే రాబోతుందని చిత్ర బృందం తెలియచేశారు. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:07 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుదల కాబోతోందని అధికారికంగా తెలియజేశారు. దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ క్రేజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
తాజాగా రజనీకాంత్ కమల్ హాసన్ చేతికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ.. ”ప్రపంచం సాక్ష్యం ఇవ్వడానికి మ్యాజిక్ ఓపెన్ చేస్తుంది” అనే కామెంట్‌తో సినిమా పట్ల భారీ హైప్ క్రియేట్ చేశారు. ‘కొందరు రూల్స్ సెట్ చేస్తే… కొందరు మాత్రమే పాలిస్తారు’ అంటూ పోస్టర్‌లో స్టోరీ హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి శనివారం రిలీజ్ కాబోయే ప్రోమో ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం జైలర్ 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఫిబ్రవరి 21న ప్రోమో విడుదల
The Magic unfolds, for the world to witness ✨ 😎 #KHxRK Promo Video from tomorrow. 12:07PM. #RedGiant17 ✨ pic.twitter.com/42tZb150oA
— Red Giant Movies (@RedGiantMovies_) February 20, 2026
రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై భారీ చిత్రం
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో జైలర్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూడోసారి నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ కమల్ హాసన్ తో కలిసిన నటించడం విశేషం. ఈ సినిమా రజనీకాంత్ కెరియర్ లో 174వ సినిమాగా రాబోతుంది. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతో ఆరాటపడుతున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతుంది. అయితే రజనీకాంత్ తన 173 వ సినిమాని కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట సుందర్ సి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. కొన్ని కారణాలవల్ల ఈయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల కాబోయే ప్రోమో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


