
📌 Key Points
- సూపర్ స్టార్ రజినీకాంత్ తన బ్లాక్‌బస్టర్ హిట్ నరసింహ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు.
- నరసింహ సీక్వెల్‌కు ‘నీలాంబరి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు రజినీకాంత్ వెల్లడించారు.
- రమ్యకృష్ణ పోషించిన ‘నీలాంబరి’ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
- ప్రస్తుతం రజినీకాంత్ దర్శకుడు నెల్సన్ కుమార్‌తో ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు పండగే! ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘నరసింహ’ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సీక్వెల్‌కు ‘నీలాంబరి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు రజినీకాంత్ వెల్లడించారు. ఐశ్వర్యారాయ్‌ను కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపారు.
నరసింహ సీక్వెల్‌ను ప్రకటించిన రజినీకాంత్
Rajinikanth; సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే నరసింహ అనే చెప్పాలి. ఈ సినిమాలో రజినీకాంత్(Rajinikanth) స్టైల్, డైలాగ్స్, ఎమోషల్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే, ఇన్నేళ్లు గడుస్తున్నా ఈ సినిమాలో అందరి మనస్సులో అలా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా పనిగట్టుకొని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. నీలాంబరిగా రమ్యకృష్ణ పాత్ర ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది.
Dekh lenge Saala Song Promo: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పవన్ స్టెప్ వేస్తే భూకంపం.. అదిరిందిరోయ్..
‘నీలాంబరి’ పాత్రకు ఐశ్వర్యారాయ్?
అవును, నరసింహా సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు రజినీకాంత్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. “నరసింహా విడుదల సమయంలో ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టిమరీ థియేటర్లలోకి వచ్చిన సినిమా చూశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. నేను చేసిన రోబో సినిమాకు సీక్వెల్ గా 2.0, జైలర్ కి జైలర్ 2 చేస్తున్నాను. అలా నరసింహ సినిమాకి కూడా రెండో భాగం ఉండే బాగుటుంది అనిపించింది. ఈ సినిమాకు ‘నీలాంబరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ని అనుకుంటున్నాం.
జైలర్ 2 పనుల్లో రజినీకాంత్
నిజానికి నరసింహ కథను ముందు ఐశ్వర్యారాయ్ అనుకున్నాం. కానీ, ఆమె సుముఖత చూపించలేదు. ఆ తరువాత శ్రీదేవి, మాధురీదీక్షిత్ కూడా అనుకున్నాం. కానీ, చివరకు రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని నమ్మము”అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు నెల్సన్ కుమార్ తో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజినీకాంత్ స్వయంగా నరసింహ సీక్వెల్, ‘నీలాంబరి’ టైటిల్‌ను ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్న తలైవా, త్వరలో ‘నీలాంబరి’ ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించనున్నారు.


