|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్ స్టార్ రజనీకాంత్ పాత ఐడీ కార్డ్ సంచలనం! కండక్టర్‌గా శివాజీరావు ప్రస్థానం!

Published: 26-05-2026, 5:00 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ పాత ఐడీ కార్డ్ సంచలనం! కండక్టర్‌గా శివాజీరావు ప్రస్థానం!
  • రజనీకాంత్ పాత బస్ కండక్టర్ ఐడీ కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది.
  • ఐడీ కార్డ్‌లో ఆయన అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ స్పష్టంగా ఉంది.
  • బెంగళూరులోని ‘రూట్ నంబర్ 10A’ బస్సులో కండక్టర్‌గా పనిచేశారు.
  • తన పాత స్నేహితుడు రాజ్ బహదూర్‌ను ఎప్పుడూ మర్చిపోలేదు.

ఇండియన్ సినిమా సూపర్‌స్టార్ రజనీకాంత్ పాత బస్ కండక్టర్ ఐడీ కార్డ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో కండక్టర్‌గా ఆయన పని చేసిన రోజుల నాటి ఈ అరుదైన గుర్తింపు కార్డు, ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌ను వెల్లడిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న అరుదైన ఐడీ కార్డ్ వివరాలు

Rajinikanth ID : ఇండియన్ సినిమాకి సరికొత్త స్టైల్ ని పరిచయం చేసిన తలైవా మొదట్లో బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS) లో బస్సు కండక్టర్‌గా పని చేశాడన్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా తాజాగా రజనీకాంత్ కండక్టర్‌గా పనిచేసిన కాలం నాటి ఆయన ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ (ID Card) ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ అరుదైన ఫోటోను చూసి తెగ మురిసిపోతున్నారు మూవీ లవర్స్.

కండక్టర్ బ్యాడ్జ్ నంబర్, ఫోటో కూడా

ఈ అరుదైన గుర్తింపు కార్డుపై రజనీకాంత్ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఆయన కండక్టర్ బ్యాడ్జ్ నంబర్, ఫోటో కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే ‘రూట్ నంబర్ 10A’ బస్సులో (శ్రీనగర్ నుండి మెజెస్టిక్ రూట్) ఆయన విధులను నిర్వహించేవారని సమాచారం.

కండక్టర్‌గా రజనీకాంత్ ప్రస్థానం

అప్పట్లో రజనీకాంత్ స్టైల్‌గా చేతి వేళ్ల మధ్య టిక్కెట్లు చించడం, విజిల్ వేయడం, ప్రయాణికులతో మాట్లాడే విధానం అప్పట్లోనే బెంగళూరు ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకునేదని ఆయన పాత స్నేహితులు తరచూ చెప్తుంటారు. 1975 ఆగస్టు 18న విడుదలైన ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన శివాజీ రావు గైక్వాడ్, ఆ తర్వాత రజనీకాంత్‌గా మారి 1978 నాటి ‘భైరవి’ సినిమాతో అధికారికంగా సూపర్‌స్టార్ అనే బిరుదును అందుకున్నారు.

అండగా నిలిచిన డ్రైవర్ రాజ్ బహదూర్‌

అయితే ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నా, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరినా తలైవా తన పాత వృత్తిని, ఆ రోజుల్లో తనలోని నటుడిని గుర్తించి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చేరడానికి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన డ్రైవర్ రాజ్ బహదూర్‌ను ఎప్పుడూ మర్చిపోలేదు. రజనీకాంత్ చెన్నైలో ఎంత బిజీగా ఉన్నా, ఇప్పటికీ బెంగళూరు వస్తే తన పాత స్నేహితుడిని కలవకుండా వెళ్లరు. గతేడాది ఆగస్టు 2023లో రజనీకాంత్ ఉన్నపళంగా  ఎలాంటి లగ్జరీ కార్లు, సెక్యూరిటీ లేకుండా బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ (BMTC) బస్ డిపోను సందర్శించి అక్కడి డ్రైవర్లు, కండక్టర్లతో సాధారణ మనిషిలా కూర్చుని సరదాగా గడిపారు. తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారితో ఫోటోలు దిగారు.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌

స్నేహితుడితో తలైవా అనుబంధం

ప్రస్తుతం ఈ ఐడీ కార్డ్ వైరల్ అవ్వడానికి మరో ఆసక్తికరమైన కనెక్షన్ కూడా ఉందండోయ్ . లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రజనీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ (Coolie) సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్లలో ఒక ప్రత్యేకమైన బస్సు కండక్టర్ బ్యాడ్జ్ నంబర్ (1421) ను మేకర్స్ చూపించారు. మొదట్లో ఇది రజనీకాంత్ పాత బ్యాడ్జ్ నంబర్ ఏమో అని అందరూ భావించారు. కానీ, ఆ నంబర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తండ్రి (ఆయన కూడా గతంలో కండక్టరే) ఒరిజినల్ బ్యాడ్జ్ నంబర్ అని డైరెక్టర్ ఈ మధ్య  ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా కనెక్షన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన తరుణంలోనే, రజనీకాంత్ ఒరిజినల్ కండక్టర్ ఐడీ కార్డ్ నెట్టింట ప్రత్యక్షమవడంతో ఫ్యాన్స్ దీనిని మరింత క్రేజీగా షేర్ చేస్తున్నారు.

గతంలో 1995 నాటి ఇండస్ట్రీ హిట్ ‘ముత్తు’ సినిమాలో బండి తోలే కార్మికుడిగా, రికార్డులు తిరగరాసిన ‘బాషా’ సినిమాలో ఆటో డ్రైవర్‌గా మాస్ ఆడియన్స్‌ను ఊపేసిన రజనీకాంత్, ఆ మధ్య ‘కూలీ’ చిత్రంతో మరోసారి అలరించిన సంగతి తెల్సిందే.ఏది ఏమైనా 1950 డిసెంబర్ 12న ఒక సాధారణ మరాఠీ కుటుంబంలో జన్మించిన రజిని, కర్ణాటకలో బస్సు కండక్టర్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదగడం యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.

రజనీకాంత్ తన పాత వృత్తిని, స్నేహితులను మర్చిపోకుండా ఉండటం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఈ ఐడీ కార్డ్ వైరల్ అవ్వడం ద్వారా ఆయన ప్రస్థానం మరోసారి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.