
📌 Key Points
- సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
- ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించగా, నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
- టీజర్ వీడియోలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, జబర్దస్త్ రోహిణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
- పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై నిహారిక ఇదివరకే ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాను నిర్మించారు.
సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాకాస. ఈ సినిమా టీజర్ విడుదలైంది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాకాస టీజర్: ఆసక్తికరమైన విషయాలు
Rakasa Teaser: టాలీవుడ్ యువ హీరో సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దశకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం రాకాస(Rakasa).సంగీత్ శోభన్(Sangeeth Sobhan), నయన్ సారిక (Nayan Sarika)జంటగా నటించిన ఈ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని ఏప్రిల్ మూడవ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు .ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది . తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు ఈ టీజర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ టీజర్ వీడియో నరకం నుంచి సందేశం వస్తోంది .. అనే డైలాగుతో ప్రారంభమవుతుంది. ఇక సమయం లేదు మన ఊరి శాపం..మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత అంటూ ఈ టీజర్ వీడియో ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకవైపు హర్రర్ టచ్ ఇస్తూనే మరోవైపు కామెడీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో టీజర్ వీడియో సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, జబర్దస్త్ రోహిణి వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సంగీత్ శోభన్ నటన గురించి
ఇక ఈ సినిమాకు మానస శర్మ(Manasa Sharma) దర్శకత్వం వహించగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై నిహారిక కొణిదెల(Niharika Konidela) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా విడుదలకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఇక నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ బ్యానర్ లో ఇది రెండో సినిమా కావటం విశేషం.. ఇదివరకు పింకీ ఎలిఫెంట్ బ్యానర్ లో కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి సినిమాతోనే నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నిహారిక ఇప్పుడు రాకాస అనే సినిమా ద్వారా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ మూడో తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సంగీత్ శోభన్ ఇదివరకు నటించిన మ్యాడ్,మ్యాడ్ స్క్వేర్, పిట్ట కథలు చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు రాకాసా వంటి ఫాంటసీ కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంగీత్ శోభన్ హిట్ కొట్టబోతున్నారని, నిహారిక ఖాతాలో మరో సక్సెస్ రావడం గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా ఈ టీజర్ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
నిర్మాతగా నిహారిక కొణిదెల
మొత్తానికి రాకాస టీజర్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తిని పెంచేసింది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సంగీత్ శోభన్ కెరీర్‌కు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.


