|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rakendu Mouli : బన్నీ వాసు అలా.. రాకేందు మౌళి ఇలా.. హిట్ అయినా కనీసం గుర్తింపు ఇవ్వలేదు.. సంచలన వ్యాఖ్యలు..

Published: 17-11-2025, 12:11 PM
Rakendu Mouli : బన్నీ వాసు అలా.. రాకేందు మౌళి ఇలా.. హిట్ అయినా కనీసం గుర్తింపు ఇవ్వలేదు.. సంచలన వ్యాఖ్యలు..

సినీ పరిశ్రమలో క్రెడిట్స్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ రచయిత రాకేందు మౌళి ఇటీవల హిట్ అయిన “మహావతార్ నరసింహ” సినిమాకు తనకు గుర్తింపు ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ వాసు గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా మౌళి ఆవేదన వ్యక్తం చేశారు.

Key Points

1

రచయిత రాకేందు మౌళి పలు డబ్బింగ్ సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్, పాటలు రాసారు.

2

"మహావతార్ నరసింహ" సినిమా తెలుగులో పెద్ద హిట్ అయినప్పటికీ మౌళికి సరైన గుర్తింపు దక్కలేదు.

4

క్రెడిట్స్, గుర్తింపు లేకపోవడంపై రాకేందు మౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాకేందు మౌళి ఆవేదన: గుర్తింపు లేని సక్సెస్

Rakendu Mouli : సినీ పరిశ్రమలో పని చేయించుకొని క్రెడిట్స్ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు అని అప్పుడప్పుడు పలువురు కామెంట్స్ చేస్తారు. అయితే గుర్తింపు లేని సమయంలో, కెరీర్ ఆరంభంలో జరిగితే ఎవరూ పట్టించుకోరు. కానీ గుర్తింపు వచ్చిన తర్వాత కూడా కనీసం పట్టించుకోకపోతే ఫీల్ అవుతారు, అది చర్చగా మారుతుంది. తాజాగా రచయిత, లిరిసిస్ట్ రాకేందు మౌళి ఓ సినిమా విషయంలో బాగా ఫీల్ అయ్యాడు.(Rakendu Mouli)

ఎన్నో సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్, సాంగ్స్ రాసాడు రాకేందు మౌళి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు తెలుగులో హిట్ అవ్వాలంటే రాకేందు మౌళినే రచయితగా తీసుకుంటారు. ఇటీవల మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా వచ్చి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు తెలుగులో పాటలు, డైలాగ్స్ రాకేందు మౌళినే రాసాడు.

బన్నీ వాసు వివరణ.. రాకేందు మౌళి ఖండన

ఈ సినిమాకు రాకేందు మౌళిని అందరూ అభినందించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ కి కనీసం రాకేందు మౌళిని ఎవరూ పిలవలేదు. కనీసం ఈవెంట్లో ఎవరూ రాకేందు మౌళి గురించి మాట్లాడలేదు. దీంతో ఈ విషయం అప్పట్లోనే చర్చగా మారింది. అనంతరం ఓ సినిమా ఈవెంట్లో బన్నీ వాసుని దీని గురించి అడిగితే.. మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు. ఆయన ఎక్కడో ఉండి ఉంటారు. అందుబాటులో లేక వచ్చి ఉండరు అని అన్నారు. అయితే తాజాగా రాకేందు మౌళి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

మహావతార్ నరసింహ సక్సెస్ మీట్ లో పాల్గొనకపోవడంపై రాకేందు మౌళి మాట్లాడుతూ.. నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు అసలు. నన్నేం చేయమంటారు. గీత ఆర్ట్స్ వాళ్ళను అడగండి. ఆ సినిమాకు డైలాగ్స్, సాంగ్స్ నేనే రాసాను. తెలుగులోనే పెద్ద హిట్ అయింది. కనీసం సక్సెస్ మీట్ గురించి చెప్పాల్సింది. సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ గారు, తనికెళ్ళ భరణి గారు, జొన్న విత్తుల గారు వీళ్లంతా వచ్చారు. వాళ్ళు హడావిడిలో మర్చిపోయారేమో కానీ రైటర్ కి మినిమమ్ గుర్తింపు ఉండాలి. నేను దీని గురించి మాట్లాడేవాడిని కాదు కానీ ఒక జర్నలిస్ట్ దీనిని ఖండిస్తూ పోస్ట్ పెట్టాడు. అందుకే మాట్లాడుతున్నాను.

“మహావతార్ నరసింహ” క్రెడిట్స్ వివాదం

ఆ సినిమాలో డైలాగ్స్, పాటలు నేనే రాసాను. హిందీ లిరిక్స్ ని రీమేక్ చేసి నేను రాయలేదు. తెలుగులో పాటలు సొంతంగా రాసాను. కానీ హిందీ లిరిక్స్ రాసిన ఆయన పేరు రాసి తర్వాత నా పేరు వేశారు. కనీసం నాకు చెప్పలేదు. ఎంతవరకు కరెక్ట్ అది. క్రెడిట్స్ ఇవ్వలేదు ఎక్కడా. మొదట నాకు ఏం చెప్పలేదు. ఇప్పటికి మహావతార్ సినిమా గురించే నాకు కాల్స్, మెసేజెస్ వస్తాయి. ఒరిజినల్ లో కూడా లేని మంచి లైన్స్ తెలుగులో రాసాను. క్రెడిట్స్ గురించి నేను ఇంక ఎవర్ని అడగలేదు అని అన్నారు. దీంతో రాకేందు మౌళి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇకముందైనా రచయితలకు సరైన గుర్తింపు ఇస్తారా చూడాలి.

రచయితల కృషిని గుర్తించకపోవడంపై రాకేందు మౌళి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒక హిట్ సినిమా వెనుక ఉన్న రచయితకు కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం పరిశ్రమలో ఆవేదన కలిగిస్తోంది. ఈ వివాదంపై స్పష్టత రావాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.