
📌 Key Points
- రకుల్ ప్రీత్ సింగ్ కు అవార్డు వేడుకలో చేదు అనుభవం ఎదురైంది.
- ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జగ్గీ రకుల్ నుండి అవార్డు తీసుకుంటూ అసహనంగా ప్రవర్తించారు.
- రకుల్ కరచాలనం చేయడానికి నిరాకరించడంతోనే తాను అలా చేశానని జగ్గీ వివరణ ఇచ్చారు.
- జగ్గీ చర్యకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక అవార్డు వేడుకలో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జగ్గీ ఆమె నుండి అవార్డు తీసుకుంటూ అసహనంగా ప్రవర్తించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం
Rakul Preet Singh:చిత్ర పరిశ్రమలో.. సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అటు సామాన్యులతోనూ తోటి సెలబ్రిటీలతోనూ కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.. తాము సెలబ్రిటీలము కదా అని కాస్త బెట్టు చేస్తే మాత్రం విమర్శలు లేదా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరిగా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పాలి. ఈమె చేసిన ఒక పనికి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చిన దెబ్బ అదుర్స్ అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఒక ప్రైవేట్ అవార్డు వేడుకల్లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ కి చేదు అనుభవం ఎదురయింది. ఫిట్నెస్ ఇన్ఫ్లు యెన్సర్ జగ్గీ.. ఈమె నుంచి అవార్డు తీసుకుంటూ అసహనంగా కనిపించారు. కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా వెళ్లిపోగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా జగ్గీ ఆమె నుంచి అవార్డు తీసుకుంటూ.. కనీసం చూడకుండా వెళ్లిపోవడంతో రకుల్ కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు జగ్గీ ఎందుకు ఇలా చేశాడు? ఆమె ముఖాన్ని కూడా చూడకుండా అలా అవార్డు తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి? ఇది రకుల్ ను అవమానించడమే కదా? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జగ్గీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. తాను ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
జగ్గీ అసహనానికి కారణం ఇదే
జగ్గీ ఒక వీడియో రిలీజ్ చేస్తూ అందులో.. “నాకంటే ముందు ఒక మహిళ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి వచ్చింది. ఆమె కరచాలనం చేయాలని చూస్తే.. దానికి రకుల్ ప్రీత్ సింగ్ నిరాకరించింది. ఇక అందుకే నేను కూడా ఆమెతో కరచాలనం చేయాలని చూస్తే.. ఆమె నిరాకరిస్తే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ తర్వాత నేనే బాధపడాల్సి వస్తుంది కూడా.. ఇలాంటి సంఘటన మళ్లీ ఎదురు కాకూడదనే నేపథ్యంలోనే నేను అలా చేయాల్సి వచ్చింది” అంటూ క్లారిటీ ఇచ్చారు జగ్గీ. మొత్తానికైతే జగ్గిచేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. కొంతమంది “టిట్ ఫర్ టాట్”, ” దెబ్బ అదుర్స్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ తప్పిదం వల్లే తాను ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని జగ్గీ క్లారిటీ ఇవ్వడంతో.. సెలబ్రిటీ అయి ఉండి ఇలా చేయడం తప్పు కదా అంటూ కొంతమంది నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ ప్రవర్తననే తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు
ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసిన ఈమె.. ఇటీవల అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. దీనికి తోడు ఇటీవల దేదే ప్యార్ దే 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సొంతం చేసుకుంది.
?utm_source=ig_web_copy_link
మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ చేసిన పని వల్లే జగ్గీ అలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్టు అయింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


