|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు ప్రత్యేక శుభాకాంక్షలు: వైరల్ అవుతున్న ప్రేమ సందేశం!

Published: 25-12-2025, 8:54 AM
రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు ప్రత్యేక శుభాకాంక్షలు: వైరల్ అవుతున్న ప్రేమ సందేశం!
  • రకుల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగులో అరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
  • రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.
  • నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్, వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
  • భర్తకు ‘హ్యాపీ బర్త్‌డే మై ఫేవరెట్ హ్యూమన్’ అంటూ పెట్టిన ప్రేమ సందేశం వీడియో వైరల్ అయింది.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నాని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ‘హ్యాపీ బర్త్‌డే మై ఫేవరెట్ హ్యూమన్’ అంటూ పెట్టిన పోస్ట్, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రకుల్ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ జర్నీ

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.

ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మ‌ధ్య ర‌కుల్‌కి టాలీవుడ్‌లో అవ‌కాశాలు కరువ‌య్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నాని(Jacky Bhagnani)ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

జాకీ భగ్నానితో రకుల్ ప్రేమ, పెళ్లి

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉండే రకూల్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘హ్యాపీ బర్త్‌డే మై ఫేవరేట్ హ్యామన్’ అంటూ భర్తకు విష్ చేసింది. అంతేకాకుండా అతనితో ఉన్న మెమోరబుల్ ఫొటోస్‌ను ఓ వీడియోలాగా క్రియేట్ చేసి.. దీనికి లవ్ సాంగ్ యాడ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. రకూల్ భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భర్తకు రకుల్ స్పెషల్ విష్: వీడియో వైరల్

A post shared by Rakul Singh (@rakulpreet)

మొత్తంగా, రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తకు తెలిపిన ప్రేమ సందేశం అభిమానులను ఆకట్టుకుంది. ఈ పుట్టినరోజు శుభాకాంక్షల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. రకుల్ దంపతులు ఆనందంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.