
📌 Key Points
- రామ్ చరణ్ రీల్స్ చూస్తున్నానని, పిల్లలను సెట్‌కు తీసుకురమ్మని శేఖర్ మాస్టర్‌తో చెప్పడం విశేషం.
- చిరంజీవి తనయుడు కాకుండా రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
- లేడీస్‌కు రామ్ చరణ్ ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పగా ఉంటుందని శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు.
- ‘ఆచార్య’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తన పిల్లల గురించి అడిగినపుడు సంతోషించానని శేఖర్ మాస్టర్ చెప్పారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి విజయ్ కుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్ అందరినీ ఎలా ఆదరిస్తారో, గౌరవిస్తారో వారు వివరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్‌పై శేఖర్ మాస్టర్ ప్రశంసలు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇష్టపడని వారెవరూ ఉండరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, ఆయనది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తనయుడు అని కాకుండా, తనకి తానుగా గ్లోబల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రామ్ చరణ్‌ని యాంటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే, అతను హెల్ప్ చేసే విధానం అలాంటిది. సెలబ్రిటీలు కూడా ఆయన హెల్ప్ తీసుకుంటారంటే, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. డౌన్ టు ఎర్త్‌కు అర్థం చెప్పాలంటే రామ్ చరణ్ పేరు చెబితే సరిపోతుంది. వ్యక్తిత్వం పరంగా తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నారు. అలాంటి రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master), నటి శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar) చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘బిగ్ బాస్ సీజన్ 9’ అనంతరం ఇప్పటి వరకు బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన వారితో ‘బీబీ జోడి’ అనే షో నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 రన్ అవుతున్న ఈ డ్యాన్స్ షోకు శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి జడ్జ్‌లుగా వ్యవహరిస్తుంటే, యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్నారు. ఈ షోలో రామ్ చరణ్‌తో మీ ఎక్స్‌పీరియెన్స్ ఏంటి మాస్టర్ అని ప్రదీప్ అడగగానే..‘ఆచార్య’ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు.. సార్ వచ్చి, మాస్టర్ మీ రీల్స్ చూస్తున్నాను. మీ పాప, బాబు బాగున్నారు. ఒక్కసారి తీసుకురండి రేపు.. చూడాలని ఉంది అంటే, అప్పుడు నేను మా పాప, బాబుని సెట్‌కు తీసుకుని వెళ్లాను. సెట్‌లో చాలా సేపు పిల్లలతో మాట్లాడారు. ఆయన అంత పెద్ద హీరో అయి ఉండి, మీ పాప, బాబుని చూడాలని ఉంది, రేపు తీసుకురండి అని అనడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందని శేఖర్ మాస్టర్ తెలిపారు.
శ్రీదేవి విజయ్ కుమార్ ఏమన్నారంటే?
వెంటనే శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా మంచి వ్యక్తి. ముఖ్యంగా లేడీస్‌కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అందరినీ ఈక్వల్‌గా ట్రీట్ చేయడమనేది నేను అతనిలో బాగా ఇష్టపడే క్వాలిటీ. ఒక యాక్టర్‌గానే కాదు, అద్భుతమైన మానవత్వం ఉన్న మనిషి ’’ అని ఆమె చెప్పగానే సెట్‌లోని వారంతా క్లాప్స్‌తో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ విషయానికి వస్తే, ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ‘చికిరి చికిరి’ పాట ఎంతగా ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా..
He treats every women equally more than an actor he is fantastic human being -Sridevi garu about @AlwaysRamCharan ❤️🥰 #RamCharan #Peddi pic.twitter.com/IXw9SjoC4o
రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ స్వభావం
— LeelaMadhuri (@MadhuCharan2731) February 19, 2026
మొత్తానికి, రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ స్వభావానికి, అందరినీ గౌరవించే మనస్తత్వానికి శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ ఫిదా అయ్యారు. ఇది రామ్ చరణ్ అభిమానులకు ఎంతో గర్వకారణం.


