
📌 Key Points
- ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల!
- చిరంజీవి రివ్యూతో సినిమాకు మరింత మెరుగులు!
- బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాలు!
- ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కు ఇది హిట్ అవుతుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రివ్యూ ఇవ్వడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
చిరంజీవి రివ్యూలో షాకింగ్ విషయాలు!
వరుసగా రెండు ప్లాప్ లు చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఏప్రిల్ 30న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
పెద్ది సినిమా విడుదల వాయిదా?
ఈ సినిమాతో రామ్ చరణ్, బుచ్చిబాబు ఎలాంటి విజయాన్ని సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్‌కు ఒక సాలిడ్ హిట్ అవసరం. ఆ లక్ష్యంతోనే ఆయన ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ హీరోగా మారిన చరణ్.. ఆతరువాత చేసిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో పెద్ది సినిమా హిట్ చరణ్ కెరీర్ కు చాలా ముఖ్యమని చెప్పాలి.
తాజాగా ఈ సినిమా రఫ్ ఫుటేజ్‌ను మెగాస్టార్ చిరంజీవి చూసినట్లు తెలుస్తోంది. ఫుటేజ్‌పై ఆయన కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కొన్ని సన్నివేశాల విషయంలో మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఆయన సూచనల మేరకు కొన్ని సీన్స్‌ను తొలగిస్తారా? లేక మరింత మెరుగులు దిద్దుకుని స్క్రీన్‌పై ప్రదర్శిస్తారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
రామ్ చరణ్ కెరీర్‌కు ఈ సినిమా ఎంత కీలకం?
చిరంజీవి జడ్జిమెంట్‌పై దర్శక నిర్మాతలకు విశ్వాసం ఉంది. ఇప్పటికే 150 సినిమాలకు పైగా నటించిన ఆయనకు 45 సంవత్సరాలకు పైగా సినీ అనుభవం ఉంది. మాస్ హీరో నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆయనకు అవగాహన ఉన్నదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అందుకే ఆయన సూచనలను మూవీటీమ్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక గత సంవత్సరం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ, ‘పెద్ది’ మాత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు సమాచారం.
చిరంజీవి సూచనలతో ‘పెద్ది’ మరింత మెరుగవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


