|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ సంచలనం! హీరోయిన్స్ వీళ్లేనా? ఊహించని ట్విస్ట్!

Published: 17-03-2026, 1:05 AM
రామ్ చరణ్ 'పెద్ది' ఐటమ్ సాంగ్ సంచలనం! హీరోయిన్స్ వీళ్లేనా? ఊహించని ట్విస్ట్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఐటమ్ సాంగ్ ప్రత్యేకంగా ఉండాలని బుచ్చిబాబు భావిస్తున్నారు.
  • ఐటమ్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ లేదా ఫరియా అబ్దుల్లా కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
  • జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
  • ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ పాటలో ఏ హీరోయిన్స్ నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా పేర్లు వినిపిస్తున్నాయి.

పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ ప్రత్యేకత

Peddi Movie : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.. గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఫాన్స్ ని దారుణంగా నిరాశపరచడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది.. రీసెంట్ గా వచ్చిన రై రై రా సాంగ్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ చరణ్ సినిమాలో ఏ సాంగ్ అయినా సరే స్పెషల్గా ఉండాలని అనుకుంటారు. మరి ఈ పాటలో ఏ హీరోయిన్స్ ని బుచ్చిబాబు దించబోతున్నాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది.. ఇంతకీ పెద్ది మూవీలోని ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్న హీరోయిన్ ఎవరో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో దొరికేకుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది.. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా మాస్ లుక్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది.. రీసెంట్ గా వచ్చిన రైరా పాట కూడా అంతకుమించి అంచనాలను పెంచుకుంది.. అయితే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ లో నటించబోతున్న హీరోయిన్ల గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవైపు మృణాల్ ఠాకూర్ అని, మరోవైపు ఫరియా అబ్దుల్లా అని అంటున్నారు.. కానీ ఇప్పటివరకైతే ఈ హీరోయిన్స్ గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అయ్యే కొన్ని రోజులు ముందు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. మరి ఇంకా కొన్ని రోజులు తర్వాత అయినా సరే ఈ పాటలోని హీరోయిన్స్ గురించి బుచ్చిబాబు బయట పెడతాడేమో చూడాలి.

హీరోయిన్స్ ఎంపికపై ఊహాగానాలు

సినిమా విడుదల మరియు ఇతర వివరాలు

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీ.. క్రికెటర్ గా చరణ్ కనిపిస్తున్నాడని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని, సినిమా మొత్తం ఎమోషనల్ గా ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటి వ‌ర‌కూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే ఈ మూవీ సరికొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్ లో ఎవరు నటిస్తారో వేచి చూడాలి. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది. సినిమా కోసం ఎదురుచూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.