|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాబాయ్ కోసం చరణ్ త్యాగం! పెద్ది మూవీ వాయిదా.. ఉస్తాద్ దెబ్బకు రికార్డ్స్ బ్రేక్!

Published: 23-01-2026, 11:35 PM
షాకింగ్: బాబాయ్ కోసం చరణ్ త్యాగం! పెద్ది మూవీ వాయిదా.. ఉస్తాద్ దెబ్బకు రికార్డ్స్ బ్రేక్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా, ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
  • బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చరణ్ త్యాగం!
  • ‘చికిరి’ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పెద్ది’ మూవీ టీమ్.
  • మార్చి 27 విడుదల కావాల్సిన సినిమా, మే లేదా జూన్ కి వాయిదా!

మెగా అభిమానులకు ఒక సంచలన వార్త! రామ్ చరణ్ యొక్క ‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

చరణ్ ‘పెద్ది’ మూవీ వాయిదా వెనుక అసలు కారణం ఏంటి?

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. ఆయన చివరగా నటించిన `గేమ్‌ ఛేంజర్‌` బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు `పెద్ది` సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఔట్‌పుట్‌ విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారట. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

`పెద్ది` సినిమా నుంచి విడుదలైన `చికిరి` సాంగ్‌ ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. అత్యధికంగా వ్యూస్‌ సాధించిన పాటగా నిలిచింది. ఇదే సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ మూవీని మార్చి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కుర్రాళ్లు థియేటర్లకి క్యూ కడుతుంటారు. ఆ సమయంలో సినిమా వస్తే మంచి ఆదరణ దక్కుతుందని టీమ్ భావించి ఈ డేట్‌ని ఫిక్స్ చేసింది.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ కోసం చరణ్ నిర్ణయం!

ఇదిలా ఉంటే ఇప్పుడీ మూవీ వాయిదా పడుతుందట. `పెద్ది` మూవీ మార్చి 27న కాకుండా వెనక్కి వెళ్తుందట. మేలోగానీ, జూన్‌లోగానీ విడుదలయ్యే అవకాశం ఉందట. మరి ఉన్నట్టుండి ఈ వాయిదా ఏంటనేది ఆశ్చర్యంగా మారింది. దానికి కారణం పవన్‌ కళ్యాణ్‌ అని సమాచారం. ఆయన హీరోగా నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారట. `పెద్ది` డేట్‌ కే దాన్ని థియేటర్లోకి తీసుకురావాలనుకుంటున్నారట. దీంతో బాబాయ్‌ కోసం రామ్‌ చరణ్‌ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

అయితే `పెద్ది` సినిమా నిర్మాతలు, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` నిర్మాతలు ఒక్కరే. మైత్రీ మూవీ మేకర్స్ వీటిని నిర్మిస్తున్నారు. హీరో, దర్శకుల అభిప్రాయం మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. బాబాయ్‌ వస్తానంటే అబ్బాయి కాదంటాడా? అందుకే `ఉస్తాద్‌` కోసం చరణ్‌ `పెద్ది` వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఇక `ఉస్తాద్ భగత్‌ సింగ్‌` చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించగా, హరీష్‌ శంకర్‌ దర్శకుడు. `గబ్బర్‌ సింగ్‌` తర్వాత ఈ కాంబో కలిసి పనిచేస్తోంది. ఇందులో శ్రీలీలా హీరోయిన్‌. ఇటీవల విడుదల చేసిన `దేఖ్‌ లేంగే సాలా` పాట ఆద్యంతం యువతని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు?

పవన్‌ కళ్యాణ్‌ చివరగా `ఓజీ` చిత్రంతో అలరించారు. ఆయన కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సుమారు మూడు వందల కోట్ల కలెక్షన్ల వరకు వెళ్లిందని సమాచారం. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించారు. ముంబాయి గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా రూపొందింది. పవన్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ మూవీ సక్సెస్‌ తో పవన్‌ బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఆయనకు మార్కెట్ విస్తరించింది. ఇది `ఉస్తాద్‌`కి హెల్ప్ కాబోతుందని చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్‌ కి డిప్యూటీ సీఎం అనే విషయం తెలిసిందే.

ఇలాంటి తాజా సినిమా వార్తల కోసం చూస్తూ ఉండండి. రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి! ఉస్తాద్, పెద్ది.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.