|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ ఫిక్స్! ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Published: 04-02-2026, 8:05 AM
Breaking: రామ్ చరణ్ 'పెద్ది' విడుదల తేదీ ఫిక్స్! ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
  • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
  • ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు.
  • సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ క్రీడా నేపథ్యంలో కనిపించనున్నారు.
  • ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఎడిటింగ్ పనుల్లో ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల

Peddi film Release: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan tej)ప్రస్తుతం బుచ్చిబాబు(Bucchi Babu ) సానా దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా మార్చ్ 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల తేదీ నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా మార్చ్ 27 నుంచి వాయిదా పడటంతో కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి .ఈ సినిమా మే ఒకటో తేదీ విడుదలవుతుందని కాదు జూన్ నెలలో విడుదలవుతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు తెరపైకి వచ్చాయి.

ఇలా ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాతలు కొత్త విడుదల తేదీని అధికారకంగా ప్రకటన చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న పెద్ద సినిమా ఏప్రిల్ 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోందనే విషయాన్ని వృద్ధి సినిమాస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆయన రాక మారిందే కానీ అతని పట్టుదల మారలేదు అంటూ విడుదల తేదీని తెలియజేశారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30 తేదీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ఎడిటింగ్ పనులలో ఉందని తెలుస్తుంది. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాబోతోందని సమాచారం. నిజానికి రామ్ చరణ్ సినిమా షూటింగుకు కాస్త విరామం ఇస్తారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ రామ్ చరణ్ ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్లో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఈయన షూటింగుకు బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది.

అధికారికంగా విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు

The date of his arrival changes, but not his MIGHTY GRIT ❤️‍🔥

​ #PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026.

Mega Power Star ​ @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu … pic.twitter.com/oFxaDnoAlZ

వేగంగా జరుగుతున్న షూటింగ్, ఎడిటింగ్ పనులు

— Vriddhi Cinemas (@vriddhicinemas) February 4, 2026

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే రెండో పాట కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఈమె అచ్చియమ్మా అనే పాత్రలో కనిపించబోతున్నారు ఇక ఈమె క్రికెట్ కామెంటెటర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక సీనియర్ నటుడు జగపతిబాబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో నిరాశ పరిచిన చరణ్ పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ 30న రానున్న ‘పెద్ది’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.