|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత! ‘రోర్ ఆఫ్ పెద్ది’ సాంగ్ తో బాక్సాఫీస్ షేక్!

Published: 01-06-2026, 5:45 PM
రామ్ చరణ్ 'పెద్ది' ఊచకోత! 'రోర్ ఆఫ్ పెద్ది' సాంగ్ తో బాక్సాఫీస్ షేక్!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుండి ‘రోర్ ఆఫ్ పెద్ది’ వీడియో సాంగ్ రిలీజ్!
  • విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులకు అదిరిపోయే ట్రీట్, చరణ్ మాస్ స్టెప్పులు!
  • కుస్తీ పోటీల విజువల్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో సాంగ్ అంచనాలు అమాంతం పెంచింది.
  • బుచ్చిబాబు సానా దర్శకత్వం, జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూన్ 4న సినిమా రిలీజ్.

టాలీవుడ్ బాక్సాఫీస్ కు కొత్త ఊపు తెచ్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారు! ఆయన నటించిన ‘పెద్ది’ చిత్రం నుండి తాజాగా విడుదలైన ‘రోర్ ఆఫ్ పెద్ది’ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ మాస్ బీట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

‘పెద్ది’ ప్రమోషన్స్ అదుర్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా పెద్ది. ఉప్పెనతో ప్రభంజనం సృష్టించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజులు గ్యాప్ తీసుకొని మరీ, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ హీరోగా చేయగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందించగా.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు.

జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ ఈవెంట్ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ కూడా ఇచ్చారు. రోల్ ఆఫ్ పెద్ది పేరుతో మస్సా మస్సా (Massa Massa) అంటూ సాగే వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ కుస్తీ పోటీలకు సంబంధించిన విజువల్స్ అందరినీ కనువిందు చేస్తున్నాయి. ఇక అటు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన హల్లల్లల్లో , చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ రిలీజ్ అయిందని ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

‘రోర్ ఆఫ్ పెద్ది’ సాంగ్ హైలైట్స్!

రామ్ చరణ్ కుస్తీ యాక్షన్!

మొత్తానికి ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ‘రోర్ ఆఫ్ పెద్ది’ సాంగ్ తో సినిమాకు మరింత హైప్ వచ్చింది. సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.