|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan: చరణ్ కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్.. ఆందోళనలో అభిమానులు

Published: 18-06-2025, 12:54 PM
Ram Charan: చరణ్ కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్.. ఆందోళనలో అభిమానులు

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం షూటింగ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Key Points

1

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు.

2

హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

4

అభిమానులు చరణ్‌ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘పెద్ది’ సినిమాలో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చిత్రం యూనిట్, విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను పూర్తి చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో భారత సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా ఉన్న హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో ఈ స్టంట్‌లో తన అభిమాన హీరోకు ఏం జరగకూడదు అని కోరుకుంటూనే.. ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

చరణ్ చేస్తున్న రిస్కీ స్టంట్స్

అభిమానుల ఆందోళన

రామ్ చరణ్ చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్స్ చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, చిత్రయూనిట్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.