
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ రూ.400 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్ హిట్, మెగా ఫ్యాన్స్‌కు పండగే.
- ఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రధాని మోదీతో చరణ్ భేటీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.
- థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు ఎక్కువంటూ చరణ్ వ్యాఖ్యలు, సామాన్యుల పక్షాన నిలిచిన మెగా హీరో.
- పాప్‌కార్న్ కాదు టికెట్ రేట్లు చూడమంటూ నెటిజన్ల మాస్ ట్రోలింగ్, సోషల్ మీడియా షేక్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో భారీ విజయం సాధించి దూసుకుపోతున్నారు. అయితే, తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. పాప్‌కార్న్ రేట్లపై చరణ్ కామెంట్స్‌కు నెటిజన్లు ఊహించని విధంగా స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!
రూ.400 కోట్ల ‘పెద్ది’ సక్సెస్, ఢిల్లీలో చరణ్ సందడి!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన సరికొత్త స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ‘రామ్‌చరణ్ వన్ మ్యాన్ షో’గా నిలిచింది. ‘ట్రిపుల్ ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత వచ్చిన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోగా.., ఇప్పుడు ‘పెద్ది’ సాధించిన సుమారు రూ. 400 కోట్ల భారీ వసూళ్లు మెగా క్యాంప్‌లో సరికొత్త జోష్ నింపాయి. ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు మేకర్స్ హైదరాబాద్‌లో భారీ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయారు. ఢిల్లీ సమ్మిట్‌లో చరణ్ సందడి ఒకవైపు సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే, రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఢిల్లీలో జరిగిన ‘ రిపబ్లిక్ సమ్మిట్ 2026 ’లో పాల్గొన్నారు. ‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’ థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మోదీ విజన్‌ను కొనియాడుతూ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. * ‘పెద్ది’లోని ఆ సీన్ నా సినిమా నుంచి కాపీ కొట్టారు. – సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ పాప్‌కార్న్ రేట్లపై కామెంట్స్.. నెటిజన్ల ట్రోలింగ్ అయితే, ఇదే సమ్మిట్‌లో రామ్‌చరణ్ సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో అని భయపడిన నిర్మాతలకు ‘ధురందర్’ లాంటి వైవిధ్యమైన దేశభక్తి చిత్రాలు నమ్మకాన్ని ఇచ్చాయని చరణ్ పేర్కొన్నారు. “భారతదేశంలో మధ్య, దిగువ మధ్యతరగతి వర్గాలకు సినిమానే ఇప్పటికీ అత్యంత చౌకైన, అందుబాటులో ఉండే వినోదం. ఒక ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో సినిమా చూడటం అనేది ఒక గొప్ప అనుభూతి. అయితే మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. వీటి ధరలను తగ్గిస్తే ప్రేక్షకులకు సినిమా చూసే అనుభవం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.” అని చరణ్ అభిప్రాయపడ్డారు. చరణ్ మాట్లాడిన ఈ పాప్‌కార్న్ మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. “థియేటర్లలో పాప్‌కార్న్ ధరల కంటే, మీ సినిమాలకు పెంచే టికెట్ ధరలే మాకు చుక్కలు చూపిస్తున్నాయి” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా విడుదల సమయంలో భారీ బడ్జెట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మరీ టికెట్ రేట్లు పెంచిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మొదటి వారం బెనిఫిట్ షోలు, ప్రీమియం రేట్లతో సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టి.. ఇప్పుడు సినిమాను చవకైన వినోదం అనడం, పాప్‌కార్న్ ధరల గురించి మాట్లాడటం కామెడీగా ఉందంటూ విమర్శిస్తున్నారు. స్టార్ హీరోలు భారీ పారితోషికాలు తీసుకోవడం వల్లే బడ్జెట్ పెరిగి, ఆ భారం టికెట్ల రూపంలో ప్రేక్షకులపై పడుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చరణ్‌కు అండగా మెగా ఫ్యాన్స్ మరోవైపు మెగా అభిమానులు చరణ్ వ్యాఖ్యలను గట్టిగా సమర్థిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని, ఫ్యామిలీతో థియేటర్‌కు వెళ్లే వారికి స్నాక్స్ ధరలు నిజంగానే భారం అవుతున్నాయని అంటున్నారు. సగటు ప్రేక్షకుడి పక్షాన నిలబడి ఒక గ్లోబల్ స్టార్ అంతటి పెద్ద వేదికపై గళం విప్పడం అభినందనీయమని, దాన్ని కావాలనే కొందరు వివాదం చేస్తున్నారని ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా.. హీరోల రెమ్యూనరేషన్లు వర్సెస్ మల్టీప్లెక్స్ పాప్‌కార్న్ ధరల మధ్య నడుస్తోన్న ఈ ఇంట్రెస్టింగ్ వార్ ఎటు దారితీస్తుందో చూడాలి.
పాప్‌కార్న్ రేట్లపై మెగా పవర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
చరణ్ కామెంట్స్‌పై నెటిజన్ల మాస్ ట్రోలింగ్, అసలు కారణం ఇదే!
ఈ సంచలన చర్చ టాలీవుడ్‌లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. రామ్ చరణ్ తదుపరి స్పందన కోసం, అలాగే సినిమా ప్రపంచంలోని మరిన్ని హాట్ అప్‌డేట్స్ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!


