
📌 Key Points
- ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రాంచరణ్ ఆసక్తి వెనుక అసలు కారణమిదే!
- ఆరెంజ్ సినిమా తర్వాత తన ఆలోచనల్లో వచ్చిన మార్పును స్వయంగా వెల్లడించిన రాంచరణ్.
- బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ.. ఏప్రిల్ 30న విడుదల!
- ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్!
రాంచరణ్ గతంలో ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే అలా జరిగిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గతంలో రాంచరణ్ తన దర్శకులని ఎంచుకునే విధానం వైవిధ్యంగా ఉండేది. ఒక దశలో ఫ్లాప్ డైరెక్టర్లు, అంతగా క్రేజ్ లేని దర్శకులతో కూడా రాంచరణ్ సినిమాలు చేశారు. దీనికి గల కారణాన్ని, తన ఆలోచనా విధానాన్ని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ధ్రువ మూవీ రిలీజ్ అయిన సమయంలో ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఇంటర్వ్యూలో రాంచరణ్ పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ రాంచరణ్ కి ఒక ఆసక్తికర ప్రశ్న సంధించారు. ఆగడు ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించారు. కిక్ 2 ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించారు. మొదటి సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో నటించినప్పటికీ ఆరెంజ్ తర్వాత మీలో మార్పు వచ్చింది.
ఆరెంజ్ సినిమా ప్రభావం?
సడెన్ గా ఎవ్వరికీ తెలియని సంపత్ నంది అనే దర్శకుడితో రచ్చ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చింది అని హరీష్ శంకర్ ప్రశ్నించారు. రాంచరణ్ సమాధానం ఇస్తూ.. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయడానికి దర్శకులు నిర్మాతలు పలో మని వచ్చేయలేదు. నేను కూడా మంచి కథతో ఎవరు వచ్చినా చేయాలి అనే ఓపెన్ మైండ్ తో ఉన్నాను.
ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయాలి అని వచ్చిన మొట్ట మొదటి నిర్మాత ఆర్ బీ చౌదరి గారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. అదే సమయంలో డైరెక్టర్ సంపత్ నంది ఓ కథతో వచ్చారు. కొత్త డైరెక్టర్.. ఒక్క సినిమా మాత్రమే చేశారు. బహుశా నేను అలాంటి కథలు చేయనేమో. కానీ ఆయన తెరకెక్కించిన తొలి సినిమా నాకు నచ్చింది. సినిమా మొత్తం ఎంటర్టైన్ అయ్యాను. అందుకే రచ్చ సినిమాకి ఓకే చెప్పినట్లు రాంచరణ్ తెలిపారు.
బుచ్చిబాబుతో రాంచరణ్ మూవీ!
ప్రస్తుతం రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
రాంచరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

