|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊరట! హైకోర్టు సంచలన తీర్పు!

Published: 09-01-2026, 4:00 AM
షాకింగ్: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊరట! హైకోర్టు సంచలన తీర్పు!
  • డ్రగ్స్ కేసులో నవదీప్‌పై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు.
  • నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని కోర్టు స్పష్టీకరణ.
  • గుడిమల్కాపూర్ కేసులో మాత్రమే నవదీప్ పేరు ఉన్నట్లు గుర్తింపు.
  • విలన్ పాత్రలతో నవదీప్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

టాలీవుడ్ నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు నవదీప్ అభిమానులకు సంతోషాన్నిచ్చింది.

డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊరట

Navadeep: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు తరచూ డ్రగ్స్ విషయంలో వార్తలలో నిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ కేసు ఆరోపణలను ఎదుర్కోవడమే కాకుండా తరచూ విచారణలకు హాజరవుతున్నారు.. డ్రగ్స్ కేసు (Drugs Case)ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిలో టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్(Navadeep) ఒకరు. ఈయన డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఈయనపై కేసులో నమోదు అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల క్రితం హైదరాబాదులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు వినిపించడంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.

ఇలా నవదీప్ గురించి డ్రగ్స్ కేసులో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. తనకు డ్రగ్స్ కు సంబంధం లేదని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే నవదీప్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడంతో తనని అరెస్టు చేయొద్దు అంటూ ఈయన గతంలో తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పిటీషన్ విచారణ జరిపిన హైకోర్టు తనని అరెస్టు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేశారు.తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ జరగడంతో నవదీప్ కు భారీ ఊరట లభించింది.

హైకోర్టు తీర్పులో కీలక అంశాలు

నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు కాబట్టి ఈ కేసును కొట్టి వేస్తున్నామంటూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఈయనకు పూర్తిస్థాయిలో ఉపశమనం లభించిందినే చెప్పాలి. ఇలా డ్రగ్స్ కేసులో భాగంగా నవదీప్ పై కేవలం గుడిమల్కాపూర్ లో నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పేరును పెట్టినట్లు హైకోర్టు వెల్లడించింది. ఈయన ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, ఆయన వద్ద నుంచి ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని స్పష్టం కావడంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది దీంతో హీరోకి భారీ ఊరట లభించింది.

డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన హీరో..

నవదీప్ కెరీర్ పై ఒక లుక్

ఇలా డ్రగ్స్ కేసులో భాగంగా నవదీప్ కు సంబంధం లేదని తెలియడంతో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నవదీప్ కెరియర్ విషయానికి వస్తే గతంలో హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇటీవల హీరోగా కంటే కూడా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నవదీప్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దండోరా సినిమాలో కీలక పాత్రలో నటించారు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమాలతో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నవదీప్ పాల్గొంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

నవదీప్ డ్రగ్స్ కేసు నుండి బయటపడటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నవదీప్ తన సినీ కెరీర్‌పై దృష్టి సారించనున్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.