|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ కి షాకింగ్ ఆపరేషన్! ఫ్యాన్స్ లో టెన్షన్.. అంతా ‘పెద్ది’ వల్లే!

Published: 17-05-2026, 6:00 AM
రామ్ చరణ్ కి షాకింగ్ ఆపరేషన్! ఫ్యాన్స్ లో టెన్షన్.. అంతా 'పెద్ది' వల్లే!
  • రామ్ చరణ్ కు ‘పెద్ది’ షూటింగ్ లో మూడు తీవ్ర గాయాలు అయ్యాయి.
  • మణికట్టు లోపల తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ తప్పనిసరి అని నిర్మాత వెల్లడించారు.
  • ట్రైలర్ లాంచ్ తర్వాత ముంబైలో శస్త్రచికిత్సకు చరణ్ సిద్ధమవుతున్నారు.
  • చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానుల ప్రార్థనలు కొనసాగుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్! ‘పెద్ది’ సినిమా కోసం చరణ్ ప్రాణం పెట్టి కష్టపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ గాయాలకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం!

‘పెద్ది’ కోసం చరణ్ పడిన కష్టం!

Ram Charan : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా భారీగా జూన్ 4న పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. బాడీ కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో చరణ్ కి గాయాలు కూడా అయ్యాయి. ఇటీవల పలువురు పెద్ది సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు చరణ్ కష్టం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు మీడియాతో మాట్లాడుతూ చరణ్ గాయాల గురించి మాట్లాడారు.

మణికట్టుకు తీవ్ర గాయం.. ఆపరేషన్ ఖాయం!

వెంకట సతీష్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి మూడు గాయాలు అయ్యాయి. కంటికి అయిన గాయం అందరికి తెలుసు. కానీ ఆయన మణికట్టుకు కూడా గాయం అయింది. మణికట్టు లోపల చాలా ఎఫెక్ట్ అయింది. అయినా కష్టపడి షూటింగ్ చేసారు. ఆయనకు ఎల్లుండి మణికట్టుకి ఆపరేషన్ ఉంది. షూట్ లో ఉన్నప్పుడు పక్కనే ఫిజియో థెరపిస్ట్ ని పెట్టుకున్నారు. షూట్ గ్యాప్ లో అక్కడే జిమ్ చేసేవాళ్ళు. కుస్తీ పోటీల్లో చాలా సార్లు చరణ్ కి కండరాలు పట్టేస్తే ఫిజియో చేయించుకొని మళ్ళీ వెంటనే వచ్చారు షూట్ కి. చరణ్ కి కాలు కూడా బెణికింది. ఇలా చాలా ఎఫెక్ట్ అయ్యాడు చరణ్ అని తెలిపారు.

ఫ్యాన్స్ లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు!

తాజాగా చరణ్ ముంబైలో కనిపించగా చేతికి కట్టు ఉంది. అది ఫిజియో చేసి టెంపరరీగా పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో చరణ్ కి ఏమైంది అని అభిమానులు కంగారు పడగా నిర్మాత ఇలా క్లారిటీ ఇచ్చారు. రేపు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయ్యాక చరణ్ ఎల్లుండి మణికట్టు ఆపరేషన్ చేయించుకోబోతున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

‘పెద్ది’ కోసం రామ్ చరణ్ పడిన కష్టం, త్యాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలతో అలరించాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.