|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ షాకింగ్ రివ్యూ! ‘డెకాయిట్’ మూవీపై సంచలన వ్యాఖ్యలు! అసలు విషయం దాచేశాడా?

Published: 14-04-2026, 8:05 AM
రామ్ చరణ్ షాకింగ్ రివ్యూ! 'డెకాయిట్' మూవీపై సంచలన వ్యాఖ్యలు! అసలు విషయం దాచేశాడా?
  • అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ మూవీకి రామ్ చరణ్ రివ్యూ.
  • సినిమా చూసి ఆస్వాదించానని తెలిపిన చరణ్.. నటీనటుల నటనను మెచ్చుకున్నాడు.
  • దర్శకుడు, సంగీతం, కెమెరా వంటి సాంకేతిక అంశాలను చరణ్ తన రివ్యూలో ప్రస్తావించలేదు.
  • ‘డెకాయిట్’ మూవీ టీమ్‌కు రామ్ చరణ్ సపోర్ట్.. మెగా అభిమానుల్లో ఆనందం.

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తాజాగా అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీపై రివ్యూ ఇచ్చారు. చరణ్ రివ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. సినిమా గురించి ఆయన ఏం చెప్పారో చూద్దాం!

చరణ్ రివ్యూలో అసలు విషయం మిస్సింగ్?

అడవి శేషు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `డెకాయిట్‌`. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శానిల్‌ డియో రూపొందించిన ఈ చిత్రాన్ని సుప్రియా నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో, మంచి కలెక్షన్లతో రన్‌ అవుతుంది. సోమవారం ఈ మూవీకి వసూళ్లు తగ్గాయి. రెండు కోట్లకుపైగానే వచ్చినా, మూడోవంతు డ్రాప్ కావడం ఆందోళన కలిగిస్తుంది. సినిమా హిట్‌ కావాలంటే ఇంకా రూ.25-30కోట్ల వరకు వసూలు చేయాలి. మరి ఇదే జోరు చూపిస్తుందా? లేదా అనేది చూడాలి. ఇలానే కంటిన్యూ అయితే ఈ వారం కాకుండా, వచ్చే వారంలో సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే ఛాన్స్ ఉంది. కలెక్షన్లు తగ్గితే స్ట్రగుల్‌ తప్పదు.

ఇక ఈ మూవీపై తాజాగా రామ్‌ చరణ్‌ స్పందించారు. తాను సినిమా చూశానని వెల్లడించారు. ఈమేరకు `డెకాయిట్‌`కి తనదైన రివ్యూ ఇచ్చారు. `డెకాయిట్‌ మూవీని చూసి, ఎంతగానో ఆస్వాదించాను. హరి పాత్రలో అడివి శేష్‌ సాలిడ్‌, మెమొరబుల్‌ యాక్టింగ్‌ని ప్రదర్శించారు. మృణాల్‌ ఠాకూర్‌ పాత్రలో చాలా డెప్త్ ఉంది. అందులో ఆమె అంతే అద్భుతంగా నటించింది. తన మార్క్ నటనతో మెప్పించింది. అనురాగ్‌ కశ్యప్‌తోపాటు ఇతర నటీనటులు బలమైన నటనతో ప్రత్యేకంగా నిలిచారు. సుప్రియా యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని చాలా కన్విక్షన్‌ తో నిర్మించి, టీమ్‌కి బ్యాక్‌ బోన్‌గా నిలిచారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిత్ర బృందానికి అభినందనలు` అని తెలిపారు రామ్‌ చరణ్‌.

డెకాయిట్ మూవీకి చరణ్ బూస్ట్ ఇస్తాడా?

అయితే చరణ్‌ తన ప్రశంస(రివ్యూ) పోస్ట్ లో కొన్ని విషయాలను వదిలేశారు. సినిమా ఎలా ఉందనేది ఆయన వెల్లడించలేదు. ఆర్టిస్ట్ ల పాత్రలను మాత్రం మెన్షన్‌ చేశారు. టెక్నీకల్‌గా సినిమా ఎలాందనేది ఆయన వెల్లడించలేదు. నిర్మాతలు, మెయిన్‌ కాస్టింగ్‌ని మాత్రమే ప్రశంసించారు. తాను సినిమాని ఆస్వాదించానని వెల్లడించారు. కానీ సినిమా బాగుందనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేకపోయారు. దర్శకుడి గురించి, మ్యూజిక్‌, కెమెరా ఇలా టెక్నీకల్‌ అంశాలను వెల్లడించలేదు. దీంతో చరణ్‌ మొక్కుబడిగానే ఈ పోస్ట్ పెట్టినట్టుగా అనిపిస్తోంది. అయితే ఆయన సినిమాని సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టడం పట్ల, చిత్ర బృందం, మెగా అభిమానులు హ్యాపీ అవుతున్నారు. సినిమా డ్రాప్‌ అవుతున్న సమయంలో రామ్‌ చరణ్‌ పోస్ట్ కొంత బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. అదే ఉద్దేశ్యంతో రామ్‌ చరణ్‌తో ఈ పోస్ట్ పెట్టించారని అర్థమవుతుంది.

అడివి శేష్ నటనపై చరణ్ ప్రశంసలు!

అడవి శేషు, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `డెకాయిట్‌` చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇందులో అడవి శేష్‌, మృణాల్‌ ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ విషయం తెలిసి మృణాల్‌ బ్రదర్‌ వీరిపై దాడి చేయగా, అతన్ని శేష్‌ చంపేస్తాడు. ఈ కేసులో ఆయన జైలుకి వెళ్తాడు. అయితే ఈ కేసులో తనని, తన ప్రియురాలు మృణాల్‌ ఠాకూరే ఇరికిస్తుంది. ఇదే పెద్ద ట్విస్ట్. ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు జైల్‌ నుంచి పారిపోయి వచ్చిన అడవిశేష్‌కి ఎలాంటి సంఘటనల ఎదురయ్యాయి? ప్రియురాలిపై పగ తీర్చుకోవాలనుకొని, ఆమెకి ఎందుకు సపోర్ట్ చేశాడు? అడవి శేష్‌ని మృణాల్‌ ఎందుకు ఇరికించింది? అప్పటికే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మృణాల్‌ కి ఉన్న సమస్య ఏంటి? వీరి ప్రేమ కథ ఎలాంటి ముగింపుని తీసుకుందనేది మిగిలిన కథ.

రామ్ చరణ్ రివ్యూ ‘డెకాయిట్’ మూవీకి కొంత బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.