
📌 Key Points
- రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ మూవీ నుండి బిగ్ అప్డేట్ రానుంది.
- రామ్ చరణ్, బుచ్చి బాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
- సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
- ‘పెద్ది’ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ రానుంది. అంతేకాకుండా, బుచ్చి బాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
రామ్ చరణ్ పుట్టినరోజు: సుకుమార్ మూవీ అప్డేట్!
Ram Charan:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడమే కాకుండా ఆ సినిమాలను ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు. ఒకవైపు కెరియర్.. మరొకవైపు వ్యక్తిగత జీవితంలో బిజీగా మారిన ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ తెలంగాణలో టికెట్టు ధరలు పెంచుకోవాలి అంటే మూడు నెలల ముందే అనుమతి తీసుకోవాలనే నిబంధనను పరిగణలోకి తీసుకొని ఏప్రిల్ 30వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేశారు.
బుచ్చి బాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించగా.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ బర్తడే రోజున సినిమా వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ కలిగినా .. సుకుమార్ (Sukumar) మూవీ నుంచి అప్డేట్ రాబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే ..’పెద్ది’ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘రంగస్థలం’ సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది. మళ్ళీ అదే కాంబినేషన్ అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అనగా మార్చి 27వ తేదీన సుకుమార్ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ ను వదలనున్నారట.
‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!
ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అధికారిక అనౌన్స్మెంట్ చేస్తారేమో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే ఆ కొత్త సినిమా అంతకుమించి రికార్డులు క్రియేట్ చేసుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సుకుమార్, రామ్ చరణ్ కాంబో మళ్ళీ.. అంచనాలు భారీగా!
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన “చికిరి చికిరి” సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి తోడు తాజాగా వచ్చిన “రై రై రా రా” అనే రెండవ పాట కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అలా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ పాట రాయడానికి తనకు ఆరు నెలల సమయం పట్టిందని అనంత్ శ్రీరామ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి చర్చల కోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ఎన్నోసార్లు చుట్టేశామని కూడా ఆయన పంచుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజున సుకుమార్ మూవీ నుండి ప్రకటన వస్తుండటం, ‘పెద్ది’ సినిమా విడుదల కానుండటంతో అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


