|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాన్న వల్లే ఆ ఛాన్స్: వారసత్వంపై శృతి హాసన్ సంచలన ప్రకటన!

Published: 23-03-2026, 3:35 AM
నాన్న వల్లే ఆ ఛాన్స్: వారసత్వంపై శృతి హాసన్ సంచలన ప్రకటన!
  • శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ చలనచిత్రంలో ఇళయరాజా సంగీతం అందించిన పాట పాడే అవకాశం వారసత్వం వల్లే వచ్చిందని ఒప్పుకున్నారు.
  • కెరీర్ విషయంలో కమల్ హాసన్, రజనీకాంత్ సలహాలు తీసుకోనని, వారి నుండి పనిని ప్రేమించడం, ఫ్యామిలీని చూసుకోవడం నేర్చుకున్నానని శృతి అన్నారు.
  • నెటిజన్లు శృతి నిజాయితీని మెచ్చుకుంటున్నారు, మిగిలిన స్టార్ కిడ్స్ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.
  • శృతి హాసన్ ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ మరియు ‘కాల్ మీ బే’ సీజన్ 2 సినిమాలలో నటిస్తున్నారు.

టాలీవుడ్‌లో నెపోటిజం గురించి శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కమల్ హాసన్ వల్లే తనకు ఇళయరాజా గారి సినిమాలో అవకాశం వచ్చిందని ఆమె కుండబద్దలు కొట్టారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

వారసత్వం వల్లే ఛాన్స్: శృతి హాసన్

Shruti Haasan: టాలీవుడ్‌లో ‘నెపోటిజం’ (వారసత్వం) అనే పదం వినిపిస్తే చాలు.. చాలా మంది స్టార్ కిడ్స్ ఒళ్ళు విరుచుకుంటారు. “మేము కూడా కష్టపడ్డాం, మాకూ స్ట్రగుల్స్ ఉన్నాయి” అంటూ క్లాసులు పీకుతుంటారు. కానీ, లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ మాత్రం రూట్ మార్చింది. తన గురించి ఎవరైనా ‘నెపో’ అనే పదం వాడితే తాను అస్సలు ఫీలవ్వనని, పైగా దాన్ని గర్వంగా ఒప్పేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇళయరాజా ఛాన్స్ ఇచ్చింది అందుకే! తాజా ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ తన కెరీర్ ఆరంభం గురించి పచ్చి నిజాలు మాట్లాడేసింది. తన తండ్రి కమల్ హాసన్ సినిమాలో, అది కూడా దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా దగ్గర పాట పాడే అవకాశం రావడం వెనుక తన ‘వారసత్వమే’ కారణమని పరోక్షంగా ఒప్పుకుంది. “మా ఇంటికి ఇళయరాజా గారు వచ్చినప్పుడు నేను గట్టిగా అరిచాను.. నా వాయిస్ బాగుందని ఆయన మా నాన్న సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇది చెప్పడానికి సులభంగానే ఉంటుంది కానీ, బయట ఉన్న టాలెంటెడ్ సింగర్స్‌కి ఇంత ఈజీగా ఛాన్స్ రాదు కదా!” అంటూ నెపోటిజం పవర్ ఏంటో చెప్పకనే చెప్పింది. అందుకే ఎవరైనా తనను ‘నెపో కిడ్’ అంటే తాను అస్సలు వ్యతిరేకించనని కుండబద్దలు కొట్టింది.

కమల్, రజనీల నుండి నేర్చుకున్నది ఏమిటి?

రజనీ, కమల్.. సలహాలు అడగను కానీ! కెరీర్ విషయంలో తన తండ్రి కమల్ హాసన్ లేదా సూపర్ స్టార్ రజనీకాంత్‌లను ఎప్పుడూ సలహాలు అడగలేదని శ్రుతి చెప్పుకొచ్చింది. అయితే వారిద్దరూ ‘పని రాక్షసులు’ అని, పనిని ప్రేమిస్తూనే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో వారిని చూసి నేర్చుకున్నానని తెలిపింది. ఒక పక్కన సినిమాలతో బిజీగా ఉంటూనే, తన తండ్రి ఇన్‌స్టాగ్రామ్‌లో వంటల రీల్స్, చిన్న పిల్లల వీడియోలు పంపిస్తూ అచ్చం ‘సాధారణ తండ్రి’లాగే ఉంటారని సీక్రెట్స్ బయటపెట్టింది.

నెటిజన్ల కౌంటర్లు: “ఒప్పేసుకున్నందుకు థాంక్స్ శ్రుతి!” సాధారణంగా వారసత్వం గురించి మాట్లాడితే నెటిజన్లు ఫైర్ అవుతుంటారు. కానీ శ్రుతి హాసన్ ఇలా ఓపెన్‌గా “అవును.. నేను నెపో కిడ్ నే” అని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. “అమ్మడు ఇన్నాళ్ళకి నిజం చెప్పింది” అని కొందరు అంటుంటే.. “మిగిలిన స్టార్ కిడ్స్ కూడా శ్రుతిని చూసి నేర్చుకోవాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో పాటు అనన్య పాండేతో కలిసి ‘కాల్ మీ బే’ సీజన్ 2లో నటిస్తున్న శ్రుతి.. తన హాట్ కామెంట్స్‌తో బాక్సాఫీస్ కంటే ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ ‘నెపో’ ట్యాగ్ శ్రుతి కెరీర్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి!

శృతి నిజాయితీని మెచ్చుకుంటున్న నెటిజన్లు

శృతి హాసన్ తన కెరీర్‌కు సంబంధించిన నిజాలను నిర్భయంగా వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ, మరికొందరు స్టార్ కిడ్స్ కూడా ఈమెను ఆదర్శంగా తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.