|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అయేషా ఖాన్ పేరుతో ఫేక్ అకౌంట్స్! దయచేసి నమ్మకండి అంటూ బ్యూటీ రిక్వెస్ట్! వైరల్ న్యూస్!

Published: 22-02-2026, 2:05 AM
షాకింగ్: అయేషా ఖాన్ పేరుతో ఫేక్ అకౌంట్స్! దయచేసి నమ్మకండి అంటూ బ్యూటీ రిక్వెస్ట్! వైరల్ న్యూస్!
  • బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు!
  • దురంధర్ సినిమాతో పాపులర్ అయిన అయేషా ఖాన్.. ఆమె పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
  • ఫేక్ అకౌంట్స్ యొక్క వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన అయేషా.. ఇది తన అకౌంట్ కాదని తెలిపింది.
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అయేషా.. ఫేక్ అకౌంట్ నంబర్ కూడా షేర్ చేసింది.. టాలీవుడ్ లో హాట్ టాపిక్!

బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. దురంధర్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ అమ్మడు పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై అయేషా సీరియస్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అయేషా ఖాన్ పేరుతో మోసాలు!

Ayesha Khan; బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. ఇక దురంధర్ సినిమా రిలీజ్ తరువాత ఈ అమ్మడుకు ఫాలోయింగ్ చాలా పెరిగింది. దురంధర్ సినిమాలో కేవలం ఒక సాంగ్ లో కనిపించి ఆ రేంజ్ లో రచ్చ చేసింది ఈ బ్యూటీ. అయితే, ఆ ఫేమ్ నే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఒక రేంజ్ లో వాడేస్తున్నారు. అయేషా ఖాన్(Ayesha Khan) పేరుపై ఫేక్ వాట్సప్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

ఫేక్ అకౌంట్స్ పై అయేషా సీరియస్ వార్నింగ్!

ఇక ఈ విషయం అయేషా వరకు చేరడంతో ఆమె స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయేషా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ ఫేక్ అకౌంట్ కి సంబందించిన వాట్సాప్ చాట్‌ స్క్రీన్‌షాట్‌ లను సైతం షేర్ చేసింది. ‘ఇది నా అకౌంట్ కాదు. దయచేసి ఇలాంటి మెసేజ్‌లను నమ్మకండి” అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, ఆ ఫేక్ అకౌంట్ కి సంబందించిన ఫోన్ నంబర్‌ను కూడా ఆమె షేర్ చేసింది. ఇలాంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించింది.

ప్రజలకి అయేషా విజ్ఞప్తి.. అప్రమత్తంగా ఉండండి!

ప్రస్తుతం అయేషా చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక అయేషా ఖాన్ విషయానికి వస్తే, కేవలం ఆమె హిందీలోనే కాదు తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. ముఖచిత్రం ఆమె మొదటి సినిమా కాగా.. ఆ తరువాత మనమే, ఓం భీం బుష్, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా వచ్చిన దురంధర్ సినిమాలో ఐటెం సాంగ్ వల్ల ఆమె పాపులర్ అయ్యింది.

అయేషా ఖాన్ ఫేక్ అకౌంట్స్ గురించి హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.