
📌 Key Points
- సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి.
- రామ్ చరణ్, మహేంద్ర సింగ్ ధోనీ, సల్మాన్ ఒకే ఫోటోలో కనిపించి ఆకర్షించారు.
- ఈ పార్టీకి బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
- రామ్ చరణ్, సల్మాన్, ధోనీ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పార్టీలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు ముగ్గురూ కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
సల్మాన్ పుట్టినరోజు వేడుకలు ఘనం
Ram Charan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ శనివారం 60వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పన్వేల్ ఫామ్‌హౌస్ లో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.
ఈ పార్టీలో టీమ్ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన భార్య సాక్షి లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జెనీలియా దేశ్‌ముఖ్, హుమా ఖురేషి, సింగర్ మికా సింగ్, సంగీతా బిజ్లా, రణదీప్ హుడా, టబు లతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.
ధోనీ, చరణ్ ప్రత్యేక ఆకర్షణ
BCCI : టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..
ఇక టాలీవుడ్ నుంచి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan ) సైతం సల్మాన్ బర్త్ డే పార్టీకి హాజరు అయ్యారు. మెగా కుటుంబంతో సల్మాన్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన నటుల్లో చిరంజీవి ఒకరు అని పలు సందర్భాల్లో సల్మాన్ వెల్లడించాడు. ఇక చిరు కోసమే ఆయన హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీలో స్పెషల్ రోల్ చేసినట్లు సల్మాన్ చెప్పిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో వైరల్ ఫోటో
SL vs PAK : సీనియర్లకు షాకిచ్చిన పాక్ బోర్డు.. వీళ్లు వద్దన్నారా? వాళ్లే తప్పుకున్నారా? శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన..
ఇక బర్త్‌డే పార్టీలో పాటు సల్మాన్, రామ్‌చరణ్, ధోని లు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో బాబీ డియోల్ సైతం ఉన్నారు.
సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో రామ్ చరణ్, ధోనీల సందడి సినీ, క్రీడా రంగాల అభిమానులను ఆకట్టుకుంది. ఈ అరుదైన కలయికతో కూడిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారి, చర్చనీయాంశంగా నిలిచింది.


