
📌 Key Points
- రామ్ పోతినేని నెక్స్ట్ మూవీకి దర్శకుడు విగ్నేష్ తప్పుకున్నాడు.
- మే 15న రామ్ పుట్టినరోజున కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రెడీ.
- ‘ది లోన్ వూల్ఫ్’ అనే టైటిల్‌తో రామ్ స్వయంగా కథ రాశాడు.
- గత సినిమా నిరాశపరిచినా, రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్‌పై భారీ అంచనాలు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో ఊహించని మలుపు! ఆయన తదుపరి చిత్ర దర్శకుడి విషయంలో వచ్చిన సంచలన వార్త టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఏం జరిగింది? రామ్ ఫ్యాన్స్‌కు ఇది షాకా? లేదా అదిరిపోయే ట్రీటా? పూర్తి వివరాలు చూద్దాం!
డైరెక్టర్ ఔట్.. రామ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన విభిన్నమైన నటన, డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన నటించిన గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆడియన్స్ ను నిరాశపరించింది అనే చెప్పాలి. ఆ తరువాత రామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడంలో కాస్త జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్ర దర్శకుడి విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
లోకేష్ కనగరాజ్ శిష్యుడికి నో చెప్పిన రామ్?
అదేంటంటే, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ శిష్యుడు విగ్నేష్‌తో రామ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూడా దాదాపు ఖరారైందని వార్తలు వినిపించాయి. కానీ, తాజాగా ఆ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫైనల్ అవుతుంది అనుకున్న తరుణంలో ఇలా దర్శకుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
బర్త్‌డేకి మాస్ అనౌన్స్‌మెంట్.. కథ రాసింది రామే!
కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మే 15న రామ్ పోతినేని(Ram Pothineni) పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథను కూడా స్వయంగా రామ్ రాసుకోవడం విశేషం. ఈ కథకు ది లోనే వూల్ఫ్ అనే డిఫరెంట్ టైటిల్ ను కూడా అనుకుంటున్నారట. మరి ఈ సినిమాతో అయినా రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.
రామ్ పోతినేని కొత్త ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడి మార్పు వెనుక అసలు కారణాలు, పుట్టినరోజు సర్‌ప్రైజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


