
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ‘శివ’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా నాగార్జున, ఆర్‌జీవీ, అమల సందడి చేశారు. రాము రాథోడ్ హౌస్‌మేట్స్‌ను కంటతడి పెట్టించారు. ఆడియెన్స్ ఓటింగ్‌లో టాప్ కంటెస్టెంట్లను ప్రకటించడంతో పాటు, వారికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, సవాళ్లు ఎదురయ్యాయి.
Key Points
రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లను తీవ్ర భావోద్వేగానికి గురిచేశారు.
'శివ' రీ-రిలీజ్ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల షోలో సందడి చేశారు.
ఆడియెన్స్ ఓటింగ్‌లో సుమన్ శెట్టి వంద శాతం మార్కులతో టాప్ స్థానంలో నిలిచారు.
టాప్ 6 కంటెస్టెంట్లకు బిగ్ బాస్ కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, వాటి కోసం త్యాగాలను పెట్టారు.
నాగార్జున, ఆర్‌జీవీ, అమల సందడి
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ తొమ్మిదవ వారం వీకెండ్‌లో నాగార్జున సందడి చేశారు. నాగ్ హీరోగా నటించిన `శివ` మూవీ ఈ నెల 14న రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ షోలో టీమ్ సందడి చేసింది. నాగార్జునతోపాటు రామ్ గోపాల్ వర్మ, అలాగే హీరోయిన్, నాగార్జున భార్య అమల మెరిశారు. ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు. `శివ` చిత్రంతోనే తాను, అమల మొదటిసారి కలుసుకున్నట్టు తెలిపారు నాగార్జున. `శివ` మూవీ విడుదలయ్యాక ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటని రాము రాథోడ్ ప్రశ్నించగా, చాలా సాడ్‌గా ఫీలయ్యానని చెప్పాడు వర్మ. ఎందుకంటే ఇది చాలా స్టుపిడ్ ప్రశ్న అంటూ కౌంటర్ వేశాడు వర్మ. నిన్ను వంద రోజులు బిగ్ బాస్‌హౌజ్‌లో ఉండమంటే ఉంటావా అని నాగ్ వర్మని ప్రశ్నించగా, అందరు సంజనా లాంటి అందమైన అమ్మాయిలు అయితే ఉంటానని చెప్పడం విశేషం. శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంది.
మరో ప్రోమోలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్ లో బెస్ట్ ఎవరు అని ఆడియెన్స్ అభిప్రాయం తీసుకున్నారు నాగ్. అందుకు వారు ఓటింగ్ వేశారు. ఇందులో టాప్ ప్లేస్‌ని సుమన్ శెట్టికి ఇవ్వడం విశేషం. వందకు వంద శాతం సుమన్ శెట్టికి మార్కులు పడ్డాయి. దీంతో ఆయనతోపాటు 95శాతం ఓటింగ్‌తో ఇమ్మాన్యుయెల్ రెండో స్థానంలో ఉన్నారు. 93 శాతం ఓట్లతో తనూజ మూడో స్థానంలో నిలవగా, 79శాతం ఓట్లతో కళ్యాణ్ నాల్గో స్థానం, 78శాతం ఓట్లతో రీతూ ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత డీమాన్ పవన్ 72శాతం ఓట్లతో ఆరో స్థానంలో నిలవడం విశేషం. బాటమ్‌లో భరణి ఉండటం గమనార్హం. భరణి సేఫ్ గేమర్ అని ఆడియెన్స్ ఇంకా ఫీలవుతున్నారు.
బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్లు వీరే!
ఈ టాప్ 6 కంటెస్టెంట్లకి బిగ్ బాస్ కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కల్పించారు. వారికి ఇంటి నుంచి వచ్చిన వాటిని ఇవ్వబోతున్నట్టు తెలిపారు. వాటిని దక్కించుకోవాలంటే హౌజ్‌లో కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా సుమన్ శెట్టికి నెక్ట్స్ వీక్ డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ అవుతామని తెలిపారు. అయితే ఓ కండీషన్ పెట్టారు నాగ్. ఇది దక్కాలంటే భరణి తన ఫ్యామిలీ వీక్‌ని సాక్రిఫైజ్ చేస్తేనే దక్కుతుందన్నారు. ఆ తర్వాత తనూజకి ఆఫర్ ఇస్తూ, మరో రెండు వారాల్లో సిస్టర్ పెళ్లి ఉందట. ఆమె వాయిస్ నోట్ పంపించింది. ఆ నోట్ వినాలంటే కళ్యాణ్ కెప్టెన్ అయినా ఇమ్యూనిటీ ఉండదన్నారు. ఆ తర్వాత రీతూకి వాళ్ల నాన్న షర్ట్ వచ్చింది. అది పొందాలంటే సంజనాకి సంబంధించిన వస్తువులన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టాలని తెలిపారు. ఇక ఇమ్మాన్యుయెల్ కి వాళ్ల లవర్ నుంచి వాయిస్ నోట్ వచ్చింది. అది వినాలంటే గౌరవ్ వద్ద ఉన్న పవర్ పోతుందన్నారు. దీనికి ఇమ్మాన్యుయెల్ ఓకే చెప్పడం విశేషం. నువ్వు సెల్ఫీష్ అంటూ గౌరవ్ ఇమ్మూపై ముద్ర వేయడం మరో విశేషం.
మరో ప్రోమోలో రాము రాథోడ్ ప్రస్తావన వచ్చింది. ఈ వారం మొత్తం ఆయన డల్‌గా ఉన్నారు. ఎందుకు డల్‌గా ఉన్నావని నాగార్జున ప్రశ్నించగా, ఫ్యామిలీ గుర్తొస్తుందన్నాడు. `బాధైతుందే` అంటూ అమ్మని గుర్తు చేసుకుంటూ పాట పాడాడు. అందరు కంటెస్టెంట్లని ఏడిపించారు. ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుందన్నారు. చిన్నప్పుడు తమని పెంచడం కోసం పేరెంట్స్ ఐదారేళ్లు వేరే ఊరుకి కూలీ పనికి వెళ్లారు. అలా దూరంగా ఉన్నారని, ఆ తర్వాత తాను ఎదిగి వారిని బాగా చూసుకోవాలనుకునే టైమ్‌లో ఇప్పుడు ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే అమ్మ బాగా గుర్తొస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాము. ఆయన మాటలకు ఇతర కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయ్యారు.
కంటెస్టెంట్లకు ప్రత్యేక ప్రయోజనాలు, త్యాగాలు
దీంతో హౌజ్ నుంచి వెళ్లిపోతావా అని నాగార్జున అడగ్గా వెళ్లిపోతానని చెప్పాడు రాము. దీంతో డోర్స్ ఓపెన్ చేయమన్నారు నాగ్. ఆ తర్వాత కూడా రెడీ అయ్యాడు. అయితే చివరగా ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పగా ఇతర హౌజ్ మేట్స్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. మరి వారి మాటలకు కన్విన్స్ అయ్యాడా? హౌజ్ నుంచి వెళ్లిపోయాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్‌లో చాలా లీస్ట్ లో ఉన్నాడు రాము రాథోడ్. అందరికంటే తక్కువ రావడమే కాదు, దారుణంగా వచ్చాయి. ఈ ఓటింగ్ లెక్కన ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కూడా అతనే. ఇప్పుడు తనే వెళ్లిపోతానని చెప్పడం గమనార్హం. మొత్తంగా ఆయన కోరిక నెరవేరుతుందని తెలుస్తోంది. ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేట్ కాబోతున్నాడట.
మొత్తంమీద, ఈ వీకెండ్ ఎపిసోడ్ భావోద్వేగాలతో, అనూహ్య మలుపులతో నిండిపోయింది. టాప్ కంటెస్టెంట్లకు లభించిన ప్రయోజనాలు, వాటి వెనుక ఉన్న త్యాగాలు సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. రాబోయే వారాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.


