|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఇంట కవలల సందడి! చరణ్, ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్! వైరల్ అవుతున్న వేడుక ఫోటోలు!

Published: 04-02-2026, 9:05 AM
మెగా ఇంట కవలల సందడి! చరణ్, ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్! వైరల్ అవుతున్న వేడుక ఫోటోలు!
  • రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం.
  • రామ్ చరణ్ ఉపాసన దంపతులు మీడియా ప్రతినిధులకు ఎలిఫెంట్ థీమ్ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపిణీ చేశారు.
  • ఈ గిఫ్ట్ హ్యాంపర్‌ను క్లీన్ కారా కొణిదెల పేరుతో పంపించారు.
  • చిరంజీవి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఈ గిఫ్ట్ పంపిణీ జరిగింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు మీడియా ప్రతినిధులకు ఎలిఫెంట్ థీమ్ తో ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మెగా కుటుంబంలో కవల పిల్లల రాకతో ఆనందం

Ram Charan Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ఉపాసన (Upasana)దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఉపాసన తన రెండో సంతానంలో భాగంగా కవల పిల్లలకు జన్మనిచ్చారు ఇందులో ఒక అమ్మాయి అబ్బాయి కావటం విశేషం. ఇలా మెగా ట్విన్స్ జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మెగా వారసుడు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది అభిమానులు రామ్ చరణ్ ఉపాసన పేరుతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు గిఫ్ట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా తమకు కవల పిల్లలు జన్మించడంతో కొంతమంది మీడియా ప్రతినిధులకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు మీడియా ప్రతినిధులకు ఇచ్చిన కానుకులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ గిఫ్ట్ హ్యాంపర్ మొత్తం ఎలిఫెంట్ థీమ్ తో ఉండటం విశేషం. ఇక ఈ గిఫ్ట్ హ్యాంపర్ చరణ్ ఉపాసనల పెద్ద కుమార్తె క్లీన్ కారా(Klin Kara) పేరుతో ఇవ్వడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ గిఫ్ట్ హ్యాంపర్‌లో చిరంజీవి తల్లి అంజనా దేవి, ఉపాసన తాతలు, సుచరిత మరియు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, చరణ్ తల్లిదండ్రులు, సురేఖ చిరంజీవి దంపతులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు అనిల్ శోభన ఆశీస్సులతో పంపించినట్ల ఒక నోట్ కూడా రాసి ఉంది.

రామ్ చరణ్ ఉపాసనల ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్

ఈ కార్డులో “క్లిన్ కారా కొణిదెలకు ఒక తమ్ముడు, చెల్లెలు జన్మించారనే విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము” అని రాసి ఉంది అలాగే ఈ కవల పిల్లలు జన్మించిన 31 జనవరి తేదీతో సంతకం చేయబడింది. ఇక చివరిగా తమ కుటుంబం పట్ల అందించిన ప్రేమ ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రాంచరణ్ ఉపాసన పేరుతో ఈ గిఫ్ట్ హ్యాంపర్ పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదటి సంతానంగా క్లీన్ కారా..

క్లీన్ కారా పేరుతో ఎలిఫెంట్ థీమ్ గిఫ్ట్

మరి ఈ గిఫ్ట్ హ్యాంపర్ లో ఏముందనేది తెలియదు కానీ ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఎంతో చూడముచ్చటగా ఉండడంతో అభిమానులు కూడా ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఉపాసన రాంచరణ్ 2012వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. ఈ దంపతులకు 2023వ సంవత్సరంలో మొదటి సంతానంలో భాగంగా క్లీన్ కారా జన్మించారు. ఈ చిన్నారి జన్మించిన రెండు సంవత్సరాలకు ఉపాసన మరోసారి కవల పిల్లలకు జన్మనివ్వటం విశేషం. ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లి తండ్రులుగా మారారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలపై చూపిస్తున్న ప్రేమను, అభిమానాన్ని ఈ గిఫ్ట్ హ్యాంపర్ ద్వారా తెలియజేశారు. ఈ వార్త మెగా అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.