|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా వారసుడి పేరు వెనుక బాలీవుడ్ సీక్రెట్! షారుఖ్ ఖాన్‌తో ఉపాసన అనుబంధం!!

Published: 13-02-2026, 9:05 AM
మెగా వారసుడి పేరు వెనుక బాలీవుడ్ సీక్రెట్! షారుఖ్ ఖాన్‌తో ఉపాసన అనుబంధం!!
  • జనవరి 31న రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించారు.
  • బాబుకు శివ రామ్, పాపకు అన్వీరా దేవి అని నామకరణం చేశారు.
  • శివ రామ్ పేరులో షారుఖ్ ఖాన్ పేరు ఉందని నెటిజన్స్ కామెంట్స్.
  • బ్రూస్‌లీ సెట్స్‌లో షారుఖ్ ఖాన్‌తో ఉపాసనకు ప్రత్యేక అనుబంధం ఉంది.

రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలలకు శివ రామ్, అన్వీరా దేవి అని పేరు పెట్టారు. శివ రామ్ పేరులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పేరు కూడా దాగివుందనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఉపాసనకు షారుఖ్ అంటే ఉన్న అభిమానమే.

మెగా ట్విన్స్ పేర్లను ప్రకటించిన రామ్ చరణ్, ఉపాసన

Shiva Ram Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు జనవరి 31న కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఈ మెగా ట్విన్స్ ఎంట్రీతో కొణిదెల, కామినేని కుటుంబాలలో ఆనందం రెట్టింపయ్యింది. మొదటి కుమార్తె క్లీంకారతో కలిసి ఇప్పుడు ముగ్గురు పిల్లలకు చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. తాజాగా జరిగిన సంప్రదాయ నామకరణ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన తమ ట్విన్స్ పేర్లను ప్రకటించారు. ఆ పేర్లు ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ గౌరవాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేసినట్లుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. మెగా ట్విన్స్‌లో బాబుకు శివ రామ్ (Shiva Ram Konidela) అని చిరంజీవి ఒరిజినల్ పేరు, రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా పెట్టారు. పాపకు అన్వీరా దేవి (Anveera Devi Konidela) అని ఆంజనేయ స్వామి, చిరంజీవి మదర్ పేరు అంజనా దేవి కలిసి వచ్చేలా నామకరణం చేశారు. ఈ పేర్లు రివీలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా వారసుడి పేరు వెనుక మరో హీరో పేరు కూడా ఉందనేలా కామెంట్స్ పడుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రూస్‌లీ’ చిత్రీకరణ టైమ్‌లో సెట్స్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉపాసనకు చాలా ఇష్టమైన హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అని రామ్ చరణ్ తెలిపారు. అంతేకాదు, ఆ సెట్స్‌కు ఉపాసనను కూడా పిలిపించి, ఆమెకు మధుర క్షణాలను రామ్ చరణ్ అందించారు. ఇప్పుడు శివ రామ్ కొణిదెల (Shiva Ram Konidela)ను గమనిస్తే.. SRK అనే షార్ట్ ఫామ్ వస్తుంది. అంతే, ఉపాసనకు ఎంతో ఇష్టమైన హీరో పేరు కూడా మెగా వారసుడి పేరులో ఉందని, SRK పేరుతో శివ రామ్ కొణిదెల పేరును ట్రెండ్ చేస్తున్నారు. కాకపోతే, ఇదేం కావాలని జరిగింది కాదు, చాలా సంప్రదాయంగా, తెలుగు పేర్లు పెట్టే క్రమంలో అలా SRK వచ్చింది తప్పితే.. ఉపాసన కోరిక మేరకు పెట్టిన పేరు మాత్రం కాదనేలా మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుండటం విశేషం.

శివ రామ్ పేరులో షారుఖ్ ఖాన్ ప్రస్తావన?

ఇక మెగా ట్విన్స్ పేర్లు, ఆ పేర్ల వెనుక ఉన్న న్యూమరాలజీ పవర్ తెలిసిన తర్వాత మెగా కుటుంబీకులే కాకుండా, మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా ట్విన్స్‌ నామకరణంపై చిరంజీవి స్పందిస్తూ చేసిన ట్వీట్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో.. ‘‘అపారమైన ఆనందం, దైవ అనుగ్రహంతో మా చిన్నారుల అందమైన పేర్లను ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. ‘శివరామ్ కొణిదెల’ & ‘అన్వీరా దేవి కొణిదెల’. శివరామ్ అనే పేరు రెండు శాశ్వత విలువల కలయికతో నిర్ణయించడం జరిగింది. ‘శివ’ అనేది శివ శంకర వరప్రసాద్ ప్రేరణతో, అంతర్ముఖ శక్తి, ఆధ్యాత్మిక లోతు, ప్రశాంతతను సూచిస్తుంది. ‘రామ్’ అనేది రామ్ చరణ్ నుండి తీసుకున్నది, ధర్మం, కరుణ, నైతిక ధైర్యానికి ప్రతీక. ఈ రెండు కలిసి అంతర్గత శక్తి, బాధ్యతాయుతమైన సమతౌల్యాన్ని సూచిస్తాయి. అన్వీరా దేవి దివ్యమైన స్త్రీశక్తికి ప్రతిరూపం. అన్వీరా అంటే నిర్భయత్వం, పట్టుదల, దైవ రక్షణ. కనకదుర్గ దేవి ఆశీస్సులతో ప్రేరణ పొందిన ఈ పేరు, సౌందర్యం, ధైర్యం, అచంచలమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. ‘శివరామ్, అన్వీరా దేవి’ జీవిత ప్రయాణం సంతోషంగా సాగాలని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం” అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

With boundless joy and divine grace ✨🙏🏻

We are delighted to announce the beautiful names of our two little blessings ❤️

“𝑺𝒉𝒊𝒗𝒂 𝑹𝒂𝒎 𝑲𝒐𝒏𝒊𝒅𝒆𝒍𝒂” & “𝑨𝒏𝒗𝒆𝒆𝒓𝒂 𝑫𝒆𝒗𝒊 𝑲𝒐𝒏𝒊𝒅𝒆𝒍𝒂”

ఉపాసనకు షారుఖ్ ఖాన్ అంటే ఎందుకంత ఇష్టం?

✨Shiva Ram is a profound confluence of two eternal ideals.

“Shiva” is… pic.twitter.com/Z2L0177cCa

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2026

ఏది ఏమైనా, శివ రామ్ కొణిదెల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సంప్రదాయంగా పేర్లు పెట్టే క్రమంలో ఇలా జరిగిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వార్త మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.