
📌 Key Points
- ఆహ్వానం మూవీ షూటింగ్ తర్వాత రమ్యకృష్ణకు వెండి పళ్లెంలో పట్టుబట్టలు, 10 వేల రూపాయలు ఇచ్చి సత్కరించిన ఎస్వీ కృష్ణారెడ్డి.
- ఎస్వీ కృష్ణారెడ్డి చూపించిన గౌరవానికి కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ గారు – అప్పటి రోజులు గుర్తు చేసుకున్న డైరెక్టర్.
- సౌందర్య గారు అవకాశాల కోసం ఫోన్ చేసేవారని, ఆమె నిబద్ధతను గుర్తు చేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి.
- సౌందర్య చనిపోయాక ఆమెను టీవీలో చూడలేకపోయేవాడిని, ఆమె నాకు ఆత్మీయురాలు – ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్ కామెంట్స్.
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రమ్యకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏమిటి? చూద్దాం!
రమ్యకృష్ణను ఏడిపించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి!
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి అందరికీ సుపరిచితమే. తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని గొప్ప చిత్రాలు అందించిన ఘనత ఆయనది. ఆయన దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అనే గ్యారెంటీ ఉండేది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. త్వరలో ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ, సౌందర్య గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
రమ్యకృష్ణ, శ్రీకాంత్ జంటగా నటించిన చిత్రం ఆహ్వానం. ఈ మూవీలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపం చూపించారు. అప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఆమె.. ఈ మూవీలో ఇక ఇల్లాలు గా, ఆమె పడే వేదనను చాలా అద్భుతంగా పండించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక.. ఎస్వీ కృష్ణా రెడ్డి గారు ఆమెకు వెండి పళ్లెంలో పట్టబట్టలు, పదివేల రూపాయలు ఇచ్చి.. బొట్టి పెట్టిమరీ గౌరవించారట. ఆయన చూపించిన ప్రేమకు రమ్యకృష్ణ గారు ఏడ్చేశారట. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణా రెడ్డి స్వయంగా చెప్పడం విశేషం.
ఆహ్వానం సినిమాతో రమ్యకృష్ణకు స్టార్‌డమ్!
నిజానికి.. ఆహ్వానం మూవీ నాటికి రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్. ఆమెకు పదివేల రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ.. ఆయన ఇచ్చిన గౌరవానికి ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. సాధారణంగా షూటింగ్ అయిపోగానే రెమ్యూనరేషన్ ఇచ్చి పంపే రోజుల్లో.. ఇలా ఒక ఆడబిడ్డలా గౌరవించడం ఆమెను కదిలించింది. అందుకే… ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సౌందర్య గారి గురించి ఎస్వీ కృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలు ఆమె నిబద్ధతను తెలియజేస్తాయి. సాధారణంగా స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోన్ చేయడం తక్కువ. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించాలని ఆమెకు ఎంత తపన ఉండేదో దీనివల్ల తెలుస్తుంది. ఒక సినిమాలో నటించే అవకాశం కోల్పోయిన ఆవిడ.. తర్వాత మరో సినిమాకి ఫోన్ చేసి మరీ తానే నటిస్తాను అని చెప్పారు అని ఎస్వీ కృష్ణా రెడ్డి గారు చెప్పారు.
సౌందర్యపై ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఎమోషనల్ కామెంట్స్!
సౌందర్య గారు చిన్న వయసులోనే చనిపోవడం ఎస్వీ కృష్ణారెడ్డి గారిని ఎంతగా బాధించిందో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ఆమెను కేవలం నటిగా కాకుండా ఒక ఆత్మీయురాలిగా భావించడం వల్ల, ఆమెను స్క్రీన్ మీద చూసినప్పుడు కలిగే బాధను తట్టుకోలేక ఆయన టీవీ ఆఫ్ చేసేవాడిని చెప్పారు. చాలా కాలంపాటు.. సౌందర్య టీవీలో కనిపిస్తే.. చూసేవాడిని కాదు అని చెప్పారు.
ఎస్వీ కృష్ణారెడ్డి గారి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ గారికి ఆయన ఇచ్చిన గౌరవం ఎంతో గొప్పది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


