|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rana Naidu 2 : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి స్ట్రీమింగ్?

Published: 20-05-2025, 10:17 AM
Rana Naidu 2 : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి స్ట్రీమింగ్?

వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌కు సీజన్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్‌లోని బూతులు, అడల్ట్ సీన్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

Key Points

1

రానా నాయుడు సీజన్ 2 జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.

2

వెంకటేష్, రానా నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్‌లోని బూతులు, అడల్ట్ కంటెంట్‌పై వివాదం.

4

సీజన్ 2లో ఎంత అడల్ట్ కంటెంట్ ఉంటుందనేది ఆసక్తికర అంశం.

రిలీజ్ డేట్ ప్రకటన

Rana Naidu 2 : వెంకటేష్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్స్ లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయింది. బాబాయ్ – అబ్బాయి కలిసి చేస్తుండటంతో అందరూ ఈ సిరీస్ పై ఆసక్తి చూపించారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక సిరీస్ చూస్తే మొత్తం బూతులు, అడల్ట్ సీన్స్, వైల్డ్ కంటెంట్ ఉండటంతో వెంకిమామ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు వెంకటేష్ ఇలాంటి సిరీస్ చేసారా అని అంతా షాక్ అయ్యారు.

రానా నాయుడులో ఉన్న అడల్ట్ కంటెంట్ తో వైరల్ అవ్వడమే కాక వివాదాల్లో కూడా నిలిచింది. పలువురు తెలుగు సెలబ్రిటీలు కూడా ఇదొక బూతు సిరీస్ అని కామెంట్స్ చేసారు. అయితే వెంకటేష్, రానా, నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇదేమి పట్టించుకోకుండా అప్పుడే సీజన్ 2 కూడా అనౌన్స్ చేసింది. ఇప్పటికే సీజన్ 2 టీజర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించారు. రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు రానా అధికారికంగా ప్రకటించాడు.

మొదటి సీజన్ వివాదం

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. రానా నాయుడు సిరీస్ లోనే బోల్డంత అడల్ట్ కంటెంట్ ఉంది. ఇక ఈ సీజన్ 2 లో ఇంకెంత అడల్ట్ కంటెంట్, బూతులు చూపిస్తారో అని పలువురు విమర్శలు చేస్తుంటే సిరీస్ నచ్చిన ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు మాత్రం రానా నాయుడు 2 సిరీస్ కోసం వెయిటింగ్ అంటున్నారు.

Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️‍🔥 Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix @VenkyMama @rampalarjun @krnx @Suparn @IncLocomotive @NetflixIndia pic.twitter.com/laB5Dv3hzE

సీజన్ 2 అంచనాలు

— Rana Daggubati (@RanaDaggubati) May 20, 2025

Also See : Abhinaya : భర్తతో కలిసి లండన్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నటి.. ఫొటోలు వైరల్..

రానా నాయుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌లోని వివాదాస్పద కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, రెండవ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.