
📌 Key Points
- బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీని కలిసిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.
- మోదీని పురాణ పురుషులతో పోలుస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్.
- “నా జన్మ ధన్యమైంది” అంటూ మోదీ చేతిని ముద్దాడిన భరణి.
- భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం పట్ల మోదీకి భరణి మద్దతు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణిని కలిశారు. ఈ అరుదైన భేటీ తర్వాత భరణి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. మోదీని పురాణ పురుషులతో పోలుస్తూ, తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మోదీని కలిసిన తనికెళ్ల భరణి భావోద్వేగం
Bharani Modi : తనికెళ్ల భరణి..పరిచయం అక్కర్లేని పేరు.రచయితగా, నటుడిగా ఏంతో గుర్తింపు తెచ్చుకున్న భరణి అన్నింటికి మించి శివ భక్తుడు కూడా.అలాంటి భరణి తాజాగా పెట్టిన ఒక పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.విషయంలోకి వెళ్తే మే 10, 2026 ఆదివారం రోజున ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే.ఈ సందర్భంగా భరణి మోడీ ని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు.ఈ క్రమంలో భరణి ఎమోషనల్ అవుతూ,మోడీని మెచ్చుకుంటూ పెట్టిన పోస్ట్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
ఏకంగా మోదీని పురాణ పురుషులతో పోలుస్తూ
“నేను రాముణ్ణి చూడలేదు.. కృష్ణుణ్ణి చూడలేదు.. ఆదిశంకరుల్ని చూడలేదు.. వివేకానందుణ్ణి చూడలేదు.. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.. నా జన్మ ధన్యమైంది” అంటూ భరణి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫొటో షేర్ చేశారు.మాములుగా సెలబ్రిటీలు పోలిటీషియన్స్ ని కలవడం,కలిసామంటూ పోస్టులు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.కానీ ఈ పోస్ట్ లో భరణి ఏకంగా మోదీని పురాణ పురుషులతో పోలుస్తూ, ఆయన చేతిని ముద్దాడటం తన అదృష్టంగా భావించానని చెప్పడం విశేషం.ఇదే కాదు గతంలో కూడా భారతీయ సంస్కృతికి, హిందూ ధర్మానికి మోదీ ఇస్తున్న ప్రాధాన్యతపై భరణి అనేకసార్లు ప్రశంసలు కురిపించారు కూడా.ముఖ్యంగా కాశీ విశ్వనాథుని కారిడార్ నిర్మాణం వంటి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆయనకు ప్రత్యేక గౌరవం ఉందన్న సంగతి తెల్సిందే.
నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.
పురాణ పురుషులతో మోదీని పోల్చిన భరణి
కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.
నా జన్మ ధన్యం. pic.twitter.com/UepoVtqxyf
— Tanikella Bharani (@TanikellaBharni) May 11, 2026
తనికెళ్ల భరణి కెరీర్ విశేషాలు
ఇక తనికెళ్ల భరణి కెరీర్ విషయానికి వస్తే ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయనో మల్టీ టాలెంటెడ్ . 1980s లో రైటర్ గా కెరీర్ మొదలెట్టిన భరణి లేడీస్ టైలర్’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’, ‘మనీ వంటి ఎన్నో మంచి మంచి సినిమాలని తన కలం బలంతో మరో మెట్టు ఎక్కించారు.ముఖ్యంగా 1989లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాకు భరణి అందించిన డైలాగ్స్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయ్.ఇక రచయితగానే కాకుండా దాదాపు 750కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు .అలా ‘యమలీల’,’సముద్రం’,’నువ్వు నేను’,’మన్మథుడు’ వంటి సినిమాల్లో చేసిన పాత్రలకి నంది అవార్డులను అందుకున్నారు కూడా.
ఇది కాస్త ఓవర్ గా లేదూ అంటూ
ముఖ్యంగా ‘మిథునం’ అంటూ 2012లో భరణి దర్శకత్వం వహించిన సినిమా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కేవలం ఇద్దరు పాత్రలతో (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి) ఒక మంచి సినిమాని వెండితెరపై ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు పొందారు. కేవలం సినిమాకే పరిమితం కాకుండా ‘నక్షత్ర దర్శనం’, ‘ఎందరో మహానుభావులు’ వంటి పుస్తకాలతో పాటు ‘శబాష్ రా శంకర’ అంటూ ఆయన రాసిన భక్తి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాము.అయితే భరణి తన పోస్ట్ లో మోడీ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడాన్ని కొందరు సమర్దిస్తుంటే, మరి కొందరు మాత్రం ఇది కాస్త ఓవర్ గా లేదూ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం.
తనికెళ్ల భరణి తన పోస్ట్‌తో ప్రధాని మోదీ పట్ల తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భరణి భావోద్వేగం అనేకమందిని ఆకట్టుకుంది.


