
📌 Key Points
- రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా 2023లో విడుదలైంది.
- ప్రస్తుతం రణ్‌బీర్ రామాయణం, లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తున్నారు.
- సినిమా ఆలస్యం అవ్వడం తన దురదృష్టమని రణ్‌బీర్ అన్నారు.
- మూడు నాలుగేళ్లు సినిమాలు విడుదల కాకపోవడంపై అభిమాని కామెంట్.
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తన సినిమాల ఆలస్యంపై నిరాశ వ్యక్తం చేశారు. అభిమాని కామెంట్స్‌కు సమాధానమిస్తూ, సినిమా ఆలస్యం కావడం తన దురదృష్టమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల ఆలస్యంపై రణ్‌బీర్ ఆవేదన
Ranbir Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి .ఇక ఈయన చివరిగా 2023వ సంవత్సరంలో యానిమల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు రణబీర్(Ranbir Kapoor) నటించిన సినిమాలు ఏవి ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ప్రస్తుతం ఈయన నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ (Ramayana)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో రణబీర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్(Love And War) సినిమా షూటింగ్ పనులలో కూడ పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తాజాగా రణబీర్ కపూర్ తన బ్రాండ్ ఏ ఆర్ కె ఎస్ ఎమోషన్లలో భాగంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక లైవ్ సెషన్ నిర్వహించారు.
అభిమాని కామెంట్స్‌పై రణ్‌బీర్ రిప్లై
ఈ లైవ్ లో భాగంగా ఒక అభిమాని చేసిన కామెంట్స్ పై ఈయన స్పందించారు. అభిమాని రణబీర్ కపూర్ గురించి కామెంట్ చేస్తూ ఒక సూపర్ స్టార్ ఉన్నాడు ఆయన ఎప్పుడూ సి యు ఎట్ ది మూవీస్ అని చెప్పి మూడు నాలుగేళ్లు కంటికి కనిపించకుండా మాయమవుతుంటాడు అంటూ కామెంట్ చేశారు. అయితే అభిమాని రణబీర్ కపూర్ గురించి ఉద్దేశించి ఈ కామెంట్ చేశారని స్పష్టమవుతుంది ఇక ఈ విషయంపై రణబీర్ స్పందిస్తూ.. అవును భయ్యా ఇది నా దురదృష్టం అంటూ రిప్లై ఇచ్చారు.
మూడేళ్లయిన సినిమాలు పూర్తి కాలేదు..
రామాయణం సినిమా కోసం ఎదురుచూపులు
ప్రతి ఒక్క హీరో కూడా తమ సినిమాలను నెలల వ్యవధిలోనే షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నారు. కానీ నా సినిమాలకు మాత్రం రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఎదురుచూపుల కష్టాన్ని మీరందరూ మర్చి పోతారని నేను భావిస్తున్నాను అంటూ ఈయన రిప్లై ఇచ్చారు. ఒక సినిమా కోసం నేను రెండు మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఇంకా షూటింగ్ పనులు పూర్తి కావడం లేదు అంటూ తన సినిమాల విషయంలో కాస్త నిరుత్సాహం ప్రదర్శిస్తూ రణబీర్ కపూర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక 2023లో యానిమల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబీర్ 2026లో రామాయణ లవ్ అండ్ వార్ సినిమాల ద్వారా రాబోతున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈయన సినిమాలు విడుదల కాబోతుండటం విశేషం. రామాయణ సినిమాలో రణబీర్ రాముడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన సినిమాల విషయంలో ఎంత నిరుత్సాహంగా ఉన్నారో తెలియజేస్తున్నాయి. ఆయన త్వరగా రామాయణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


