
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫ్రాంచైజీ: రెండు సినిమాలతోనే రూ. 3000 కోట్ల వసూళ్లు!
- వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ రికార్డులను బద్దలు కొట్టిన ధురంధర్ దూకుడు
- ‘ధురంధర్: ది రివెంజ్’ మొదటి రోజు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది
- పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం!
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ సంచలనం సృష్టిస్తోంది. కేవలం రెండు సినిమాలతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ రికార్డులను బ్రేక్ చేసింది. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
దుమ్మురేపుతున్న ధురంధర్ ఫ్రాంచైజీ
Dhurandhar Vs YRF Spy Universe Box Office: ఆదిత్య ధర్ సృష్టించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రెండు సినిమాలతోనే రూ. 3000 కోట్ల వసూళ్లను రాబట్టి, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్, బాహుబలి చిత్రాల రికార్డులను మట్టికరిపిస్తూ అగ్రస్థానానికి దూసుకెళ్తోంది.
Dhurandhar Vs YRF Spy Universe Box Office Collection: భారతీయ చలనచిత్ర రంగంలో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. అదే ‘ధురంధర్’. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
భారత సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఫ్రాంచైజీగా ధురంధర్ నిలిచింది. వచ్చే వారం నాటికి ఇది ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ను కూడా దాటేసి నంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌కు షాక్
ఇక మార్చిలో విడుదలైన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ అయితే బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే రోజు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన తొలి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించడమే కాకుండా, మొదటి వీకెండ్‌లోనే మూడుసార్లు ఈ ఫీట్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఏప్రిల్ 16 నాటికి ఈ ధురంధర్ 2 భారత్‌లో రూ. 1025 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1720 కోట్లకు పైగా వసూలు చేసింది. నిర్మాతల లెక్కల ప్రకారం ఈ వసూళ్లు రూ. 1760 కోట్లు దాటినట్లు తెలుస్తోంది.
రణ్‌వీర్ సింగ్ విధ్వంసం
కానీ ‘ధురంధర్’ సీక్వెల్ విడుదలైన వారం రోజుల్లోనే ఈ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఆరు సినిమాలతో ఉన్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సాధించిన రూ. 3100 కోట్ల రికార్డును, ధురంధర్ కేవలం రెండు సినిమాలతోనే అధిగమించడానికి సిద్ధమైంది. ధురంధర్ ఫ్రాంచైజీకి ఇప్పటికే 3 వేల కోట్లు రాగా ఇంకో వంద కోట్లు వస్తే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌ను బీట్ చేసినట్లే అవుతుంది.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే భారత గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్ ఈ సినిమాలను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఉండటం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది.
దురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో వేచి చూడండి!


