|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ranaveer Singh : దీపికా పై రణవీర్ కామెంట్స్.. 8 గంటల్లో సినిమా కష్టం.. ఇద్దరి మధ్య గొడవలా..?

Published: 15-12-2025, 12:08 AM
Ranaveer Singh : దీపికా పై రణవీర్ కామెంట్స్.. 8 గంటల్లో సినిమా కష్టం.. ఇద్దరి మధ్య గొడవలా..?
  • రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ చిత్రం భారీ విజయం సాధించింది.
  • విజయానంతరం ఇంటర్వ్యూలో దీపిక పదుకొనే 8 గంటల పని గురించి రణవీర్ మాట్లాడారు.
  • ‘దురంధర్’ వంటి సినిమాను 8 గంటల్లో పూర్తి చేయడం కష్టమని రణవీర్ వ్యాఖ్యానించారు.
  • ఈ వ్యాఖ్యలతో దీపిక-రణవీర్ మధ్య గొడవలంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ‘దురంధర్’ విజయం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య దీపికా పదుకొనే గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీపికా 8 గంటల పని విధానంపై రణవీర్ చేసిన కామెంట్స్, వారిద్దరి మధ్య గొడవలకు దారితీశాయనే చర్చకు దారితీశాయి. పూర్తి వివరాలు కథనంలో.

రణవీర్ ‘దురంధర్’ విజయం, ఆసక్తికర వ్యాఖ్యలు

Ranaveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..  తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకపోయినా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ హీరో సుపరిచితమే.. ప్రముఖ వాణిజ్య ప్రకటనలో కనిపిస్తూ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.. ఈయన నటించిన తాజా చిత్రం దురంధర్.. ఆ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. ఒకవైపు విమర్శలు అందుకున్న కూడా మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. ఈ భారీ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో పలు ఛానెల్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక పదుకొనే పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీపికా 8 గంటల టైం గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోలో రణవీర్ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తాజాగా నటించిన చిత్రం దురంధర్.. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. కేవలం ఏడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిట్ గా నిలిచింది. సినిమాకు వస్తున్న ఆదరణతో ఈ కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో హీరో రణవీర్ సింగ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… దురంధర్ లాంటి సినిమాని ఎనిమిది గంటల్లో పూర్తి చేయడం కష్టమని అన్నాడు.. గతంలో దీపిక పదుకొనే రోజుకి 8 గంటలు మాత్రమే పని చేస్తాను అని అన్న విషయాలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.. భార్య ఏమో 8 మాత్రమే అని కొత్త సినిమాలకు కండీషన్స్ పెడుతుంది. కానీ భర్త ఏమో ఇలా సినిమాకు టైం పెట్టుకొని చెయ్యడం కష్టం అని అనడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది.. ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా జరుగుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.. మరి దీనిపై దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

దీపికా 8 గంటల పనిపై రణవీర్ అభిప్రాయం

సోషల్ మీడియాలో రణవీర్-దీపికా గొడవల రూమర్స్

బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. దురంధర్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం..

రణవీర్ సింగ్ వ్యాఖ్యలు, దీపికా పదుకొనే 8 గంటల పని విధానంపై జరుగుతున్న చర్చ, వారి వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలకు దారితీసింది. ఈ వివాదంపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా లేదా నిజమైన గొడవలా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.