|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన రాశి ఖన్నా.. ప్రెట్టీ అంటూ నెటిజన్ల కామెంట్స్

Published: 14-07-2025, 5:17 AM
క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన రాశి ఖన్నా.. ప్రెట్టీ అంటూ నెటిజన్ల కామెంట్స్

టాలీవుడ్ నటి రాశి ఖన్నా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని క్యూట్ ఫోటోలను పంచుకుంది. పింక్ డ్రెస్సులో ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Key Points

1

రాశి ఖన్నా తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2

పింక్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించింది.

4

ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

రాశి ఖన్నా కొత్త ఫోటోలు

‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జోరు’(Joru), ‘జిల్’(Jill), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘శివం’(Shivam), ‘సుప్రీమ్’(Supreme), ‘హైపర్’(Hyper), ‘జై లవకుశ’(Jai Lava Kusa), ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘ఆక్సిజన్’(Oxigen), ‘టచ్ చేసి చూడు’(Touch chesi Chudu), ‘తొలిప్రేమ’(Tholi Prema), ‘ప్రతి రోజు పండగే’(Prati Roju Pandage), ‘వెంకీ మామ’(Venky Mama), ‘వరల్డ్ ఫేమస్ లవర్’(world Famous Lover), ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial), ‘తిరు’(Thiru) వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.

ప్రస్తుతం తెలుసు కదా మూవీలో నటిస్తోంది. స్టార్ బాయ్ సిద్ధుల జొన్న హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రాశి ఖన్నా తన ఎక్స్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ డ్రెస్సులో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా అనిపించింది. బొట్టు పెట్టుకుని, చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. దీంతో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు చాలా ప్రెట్టీగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిన్నదాని పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. Link

నెటిజన్ల ప్రశంసలు

వైరల్ పోస్ట్

రాశి ఖన్నా అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి. నెటిజన్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.